Multibagger Stocks: షేర్ మార్కెట్ అంటేనే ఎగుడు దిగుడుల ప్రపంచం. కొన్ని కంపెనీల షేర్లు అమాంతం పెరుగుతుంటే..మరికొన్ని పడిపోతుంటాయి. మల్టీబ్యాగర్ షేర్లు ఇలానే లాభాలు పండిస్తున్నాయి. 28 కోట్లకు దారి తీసిన స్టాక్ గురించి తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్ గురించి తెలిసినవారికి మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటే తెలుస్తుంది. భారీగా లాభాలు తెచ్చిపెడుతుంటాయి. అలాంటిదే మరో షేర్ ఇది. ఐచర్ కంపెనీ షేర్ 23 ఏళ్లలో లక్ష రూపాయల్నించి 23 కోట్లుగా మారింది. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..


భారీ స్థాయి బ్లూ చిప్ కంపెనీల్లో ఒకటి ఐచర్ మోటార్స్. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 93 వేల 569.71 రూపాయలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ట్రేడ్ మార్క్ కలిగిన ఐచర్ మోటార్స్..ఇండియాలోని ఆటోమొబైల్ రంగంలో కీలకమైన వ్యాపారాన్ని కలిగి ఉంది. మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ఐచర్ మోటార్స్ షేర్లు ఇన్వెస్టర్లను బిలియనీర్లుగా మార్చేశాయి.


ఐచర్ మోటార్స్ షేర్ల చరిత్ర


ఐచర్ మోటార్స్ లిమిటెడ్ ఎన్ఎస్ఈలో శుక్రవారం నాడు 3,429.40 రూపాయలకు ముగిసింది. అంతకుముందు రోజు 3, 411.60 రూపాయలకు అదనంగా 0.52 శాతం పెరిగింది. 10 లక్షల 38 వేల97 షేర్లు ట్రేడ్ అయ్యాయి. అటు 12 లక్షల 58 వేల 822 షేర్లు 20 రోజుల సరాసరికి చేరుకున్నాయి. 1999 జనవరి 1 నుంచి 1.22 రూపాయల్నించి ఈ కంపెనీ షేర్లు పెరగడం ప్రారంభమైంది. 23 ఏళ్ల తరువాత ఇప్పుడి ఈ షేర్లు ఆల్ టైమ్ హైగా 280.998.36 శాతం పెరిగాయి. అంటే 23 ఏళ్ల క్రితం 1 లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టుంటే..ఇప్పుడది 28.10 కోట్లు అయిందని అర్ధం.


ఐచర్ మోటార్స్ కంపెనీ 2022 తొలి క్వార్టర్‌లో కూడా 1974 కోట్లు పెరిగి 3,397 కోట్ల అమ్మకాలు జరిపింది.  కంపెనీ ఖర్చులు 59.3 శాతం పెరిగాయి. ఐచర్ మోటార్స్ కంపెనీ షేర్లు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయని..మార్కెట్ వాటా పెంచుకుంటూ దేశంలోని టూ వీలర్ రంగంలో అద్భుత ప్రగతి కనబరుస్తోందని ప్రముఖ బ్రోకింగ్ కంపెనీ షేర్‌ఖాన్ తెలిపింది. 


Also read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. వరుసగా మూడో రోజు తగ్గిన బంగారం ధరలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook