Multibagger Stock: షేర్ మార్కెట్ అంటేనే ఓ మాయ. ఎప్పుడు ఏమౌతుందో తెలియని పరిస్థితి. ఒకప్పుడు కేవలం 15 రూపాయలున్న ఆ కంపెనీ షేర్ ఇప్పుడు ఏకంగా 3 వేల రూపాయలకు చేరుకుంది. ఆశ్చర్యంగా ఉందా..ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షేర్ మార్కెట్ అనేది ఎగుడు దిగుడుల ప్రపంచం. లాభనష్టాల వేదిక. ఉన్నట్టుంది ధనికుల్ని చేస్తుంది. మరోవైపు కుదేలయ్యేలా కూడా చేస్తుంది. కొన్ని పెట్టుబడులు అద్భుతమైన లాభాల్ని తెచ్చిపెడతాయి. షేర్ మార్కెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్ని షేర్లు అద్భుతమైన లాభాల్ని ఆర్జించి పెడుతున్నాయి. ఇలాంటి షేర్లను మల్టీ బ్యాగర్ షేర్లంటారు. ఇందులో కెమికల్ రంగానికి చెందిన ఓ షేర్ కూడా ఉంది. ఆ షేర్ గురించే ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకోవల్సిన సందర్భం వచ్చింది.


ఈ కంపెనీ షేర్ పెట్టుబడుదారుల వాటాను పదేళ్లలో చాలా పెంచేసింది. 12 ఏళ్లలో ఈ షేర్ దాదాపు 11,177.37 శాతం రిటర్న్ ఇచ్చిందంటే ఆశ్చర్యంగా ఉందా. నిజమే మరి. ప్రస్తుతం ఈ షేర్ 2 వేల కంటే ఎక్కువకే ట్రేడ్ చేస్తోంది. 


దీపక్ నైట్రైట్ కంపెనీ షేర్ ఇది. ఈ కంపెనీ తక్కువ కాలంలోనే పెట్టుబడిదారులకు అత్యధిక లాభాలు ఇచ్చింది. ఓ సమయంలో దీపక్ నైట్రేట్ షేర్ కేవలం 15 రూపాయలుండేది. ఆ తరువాత ఈ షేర్ ఒక్కసారిగా వేగం పుంజుకుని..3 వేల రూపాయలకు చేరుకుంది. 2012 ఫిబ్రవరి 12 వతేదీన దీపక్ నైట్రేట్ కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 15.01 రూపాయలకు క్లోజ్ అయింది. ఆ తరువాత క్రమంగా పెరుగుతూ పోయింది. 2021 అక్టోబర్ నెలలో ఈ షేర్ ధర ఆల్ టైమ్ గరిష్టానికి అంటే 3 వేల రూపాయలకు చేరుకుంది. ఎన్ఎస్ఈపై దీపక్ నైట్రేట్ గరిష్ట ధర 52 వారాల అత్యధికానికి అంటే 3.20 రూపాయలైంది. ఆ తరువాత మళ్లీ తగ్గింది. ఇప్పుడీ కంపెనీ షేర్ ధర 2 వేల రూపాయలుంది. ఇప్పుడీ కంపెనీ 52 వారాల కనిష్ట ధర 1681.15 రూపాయలుగా ఉంది. పదేళ్ల క్రితం ఉన్న 15 రూపాయలతో కనిష్ట ధర పోల్చినా చాలా రెట్లు అధికమే.


షేర్ మార్కెట్‌లో పదేళ్ల క్రితం ఎవరైనా 15 రూపాయలకు దీపక్ నైట్రేట్ షేర్లు 1000 కొనుగోలు చేసుంటే..అప్పట్లో 15 వేల పెట్టుబడి అయ్యేది. అదే వేయి షేర్లు 3 వేల ధరకు చేరుకున్నప్పుడు పెట్టుబడిదారులకు 30 లక్షల రూపాయలు ఆర్జించి పెట్టింది. ఇప్పుడు కూడా అదే 15 వేల రూపాయల షేర్లు 20 లక్షల రిటర్న్ సంపాదించి పెడుతున్నాయి.


Also read: Whatsapp New Feature: వాట్సప్ కొత్త ఫీచర్, గ్రూపులో ఎవరికీ మీ నెంబర్ కన్పించకుండా చేయొచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook