IT Industry: సాధారణంగా స్టాక్ మార్కెట్లో ఒక కంపెనీ ఫలితాలు ఆశించిన స్థాయిలో లేనట్లయితే ఇన్వెస్టర్లు అసహనం వ్యక్తం చేయడం సహజ. కానీ ఈ సారి భారత ఐటీ రంగంపై వస్తున్న విమర్శలు కేవలం లాభనష్టాలకు మాత్రమే పరిమితం అవ్వలేదు. ఐటీ కంపెనీల యాజమాన్యాల తీరు.. వారి వ్యూహరహిత నిర్ణయాలు, దేశ సాంకేతిక భవిష్యత్తును ఫణంగా పెడుతున్నారన్న ఆరోపణలు ఇప్పుడు పెను దుమారాన్నే రేపుతున్నాయి.
DMart Shares: భారత రిటైల్ రంగ దిగ్గజం, రాధాకిషన్ దమానీ సారథ్యంలోని అవెన్యూ సూపర్ మార్ట్స్ సరికొత్త మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా డీమార్ట్ స్టోర్ల సంఖ్య ఏకంగా 500 మార్కుకు చేరుకోవడంతో కంపెనీ బలం మరింత పెరిగింది. ఈ మెగా విస్తరణ వార్తతో ఏప్రిల్ 1న స్టాక్ మార్కెట్ ప్రారంభం కాగానే డీమార్ట్ షేర్లు రాకెట్లా దూసుకుపోయాయి.
Silver Price Today: 2026 మార్చి నెల భారత బులియన్ మార్కెట్ చరిత్రలో అత్యంత అస్థిరమైన నెలగా నిలిచిపోనుంది. నెల ప్రారంభంలో చుక్కలనంటిన ధరలు, నెల ఆఖరికి వచ్చేసరికి పాతాళానికి పడిపోయాయి. బంగారం ధర తులంపై సుమారు రూ. 22,000, వెండి ధర కిలోపై ఏకంగా రూ. 67,000 మేర తగ్గడం మార్కెట్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
Indian Rupee All Time Low : పశ్చిమ ఆసియా యుద్ధ సెగతో భారత రూపాయి అగాధంలోకి జారుకుంది. డాలర్‌తో పోలిస్తే రూ. 95.20 కి పడిపోయి ఆల్-టైమ్ లో రికార్డు సృష్టించింది. పెట్రోల్ ధరల పెరుగుదల, ఈఎంఐల భారం సామాన్యుడికి కరెన్సీ కష్టాలను రుచి చూపించబోతున్నాయి. ఆర్బీఐ బ్రేకులు వేయాలని చూస్తున్నా.. యుద్ధం ఆగకపోతే రూపాయి సెంచరీ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Good Time To Buy Gold: సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఉద్రిక్తతలు పెరిగినా పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి బంగారంలో పెట్టుబడులు పెంచుతారు. దీనివల్ల పసిడి ధరలు ఆకాశాన్నంటాలి. కానీ, ప్రస్తుత ఇరాన్-అమెరికా యుద్ధం దీనికి భిన్నమైన ఫలితాలను ఇస్తోంది. మధ్యప్రాచ్య సంక్షోభం ప్రారంభమైనప్పటి నుండి బంగారం ధరలు పెరగకపోగా, నిరంతరం పడిపోతూ కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి.
Silver Rate Today: నేడు మార్చి 30, సోమవారం నాడు వెండి ధరలు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నాయి. కిలో వెండి ధర రూ. 2,36,374 నుండి ఒక్కసారిగా సుమారు 4వేల రూపాయలు పతనమై రూ. 2,32,703 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్టంగా 2 లక్షల దిగువకు పడిపోయిన వెండి, ఇటీవలే కోలుకుంటున్నట్లు కనిపించినా.. తాజా అంతర్జాతీయ పరిణామాలతో మళ్ళీ కరెక్షన్ బాట పట్టింది. యుద్ధ వార్తల నేపథ్యంలో వెండి ధరలు 'బుడిబుడి అడుగులు' వేస్తూ పెరగడం, మళ్ళీ అదే స్థాయిలో పడిపోవడం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది.
Gold Rate Today: నేడు మార్చి 30వ తేదీ, సోమవారం నాడు అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా కుదేలయ్యాయి. సాధారణంగా యుద్ధం వంటి అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరలు ఆకాశాన్నంటాలి. కానీ ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పసిడిపై భిన్నమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
Stock Market Today: సోమవారం నాటి భారీ పతనం తర్వాత.. మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇన్వెస్టర్లలో నెలకొన్న యుద్ధ భయాలను డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒకే ఒక ప్రకటన పటాపంచలు చేసింది. మంగళవారం ఉదయం 9:15 గంటలకు మార్కెట్ ప్రారంభమైన సెకన్ల వ్యవధిలోనే బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1040 పాయింట్లు ఎగబాకి 73,736.84 వద్ద ట్రేడ్ అవ్వగా.. నిఫ్టీ 350 పాయింట్ల లాభంతో 22,863.25 వద్దకు చేరింది. మార్కెట్లోని అన్ని రంగాలు ఆకుపచ్చ రంగులో మెరుస్తుండటం విశేషం.
Stock Market Crash: మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా పడిపోగా, నిఫ్టీ 600 పాయింట్లకు మించి క్షీణించింది. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, పెట్టుబడిదారుల ఆందోళనల కారణంగా సూచీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Stock Market: పశ్చిమాసియాలో యుద్ధ ప్రకంపనలు దలాల్ స్ట్రీట్ నూ అతలాకుతలం చేశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్ట్స్, నిఫ్టీ భారీగా పతనం అయ్యాయి. ప్రపంచ ఇంధన సరఫరాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధి మూసివేత కారణంగా చమురు ధరలు పెరగడం, తాజా ఉద్రిక్తతల ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయాలు నెలకున్నాయి. మదుపర్లు సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ 10లక్షల కోట్ల మేర ఆవిరైంది.
Stock Market Middle East tensions: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, అనంతర పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు బిగ్ షాకిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, చమురు ధరల పెరుగుదలతో సూచీలు భారీగా పతనం అయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 300 పాయింట్ల మేర తగ్గింది.
TATA Stock: టాటా గ్రూప్ నుకు చెందిన స్టాక్ ట్రెంట్ లిమిటెడ్ షేర్లు 52వారాల కనిష్టానికి పడిపోయియింది. గత కొన్ని త్రైమాసికాలుగా అమ్మకాలు తగ్గడమే దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తుంది. గత ఐదేళ్లలో మాత్రం ఈ కంపెనీ తమ షేర్ హోల్డర్స్ కు 500శాతం లాభాలను అందించింది. ఇటీవల కంపెనీ అమ్మకాల వృద్ధి తగ్గడంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటుంది. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్లు స్వల్ప లాభంతో ట్రేడ్ అవుతున్నా దీర్ఘకాలంలో ఎలాంటి పనితీరును కనబరుస్తుందో చూడాలి.
Best Stocks To Buy: దేశంలోని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కేటగిరీలకు చెందిన ఐదు స్టాక్స్‌కు బై రేటింగ్ ఇచ్చి, ఆకర్షణీయమైన టార్గెట్ ప్రైజులు సూచించాయి. అపీజయ్ సురేంద్ర పార్క్ హోటల్స్, లోథా డెవలపర్స్, వీ వర్క్ ఇండియా, హిందూస్తాన్ కాపర్, 360 వన్ వామ్ స్టాక్స్‌లో 40–70శాతం వరకు లాభాల అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు.
Healthcare Revolution: భారత్ లో హెల్త్‌కేర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. పెరుగుతున్న జనాభా, ఆధునిక జీవనశైలి, టెక్నాలజీ వినియోగం, ప్రభుత్వ ప్రోత్సాహం అన్నీ కలిసి హెల్త్‌కేర్ సెక్టార్‌ను రాబోయే దశాబ్దాల్లో అతిపెద్ద విప్లవంగా మారబోతోంది. ఇది పెట్టుబడిదారులకు ఒక గోల్డెన్ ఛాన్స్‌గా మారనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం హెల్త్‌కేర్ రంగం భారత్‌లో 100 బిలియన్ డాలర్ల మార్కెట్‌గా ఉంది. నిపుణుల అంచనా ప్రకారం 2030 నాటికి ఇది 500 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Urban Company IPO: భారత ఐపీఓ మార్కెట్ దుమ్మురేపుతోంది. ఈ వారం మూడు మెయిన్ బోర్డ్ ఐపీఓలు సబ్ స్క్రిప్షన్ కోసం వచ్చాయి. వీటికి ఇన్వెస్టర్ల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రూ. 2,400కోట్లకు గానూ దాదాపు రూ. 1.2 లక్షల కోట్ల బిడ్లు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్ వచ్చింది. గ్రే మార్కెట్లో ఈషేర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది.
Stocks To Watch : గతవారం నష్టాల్లో పయనించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాలతో కళకళలాడాయి. జీఎస్టీసంస్కణలు, అంచనాలకు మించిన జీడీపీ గణాంకాలు వంటి అంశాలను మార్కెట్ సెంటిమెంట్ ను బలపరిచాయని చెప్పవచ్చు. దీంతో సూచీలు సోమవారం లాభాలను దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ ముగిసిన తర్వాత చాలా కంపెనీలు ముఖ్యమైన అప్డేట్స్ ను మార్కెట్ కు అందించాయి. ఈ అప్ డేట్స్ మంగళవారం మార్కెట్ ప్రారంభమైన వెంటనే స్టాక్స్ లో మంచి మూమెంట్ కనిపించే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం స్టాక్ మార్కెట్లో చూడాల్సిన స్టాక్స్ ఏవో చూద్దాం.
Stocks to Watch: బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్స్ నుంచి సానుకూల సంకేతాలు, ఆటో, మెటల్, ఫార్మా షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో బాగా రాణించాయి. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు తగ్గట్లుగా రావడంతో సెప్టెంబర్ లో ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉంటుందన్న అంచనాలతో ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ సూచీలు రాణించాయి. కాగా మార్కెట్ ముగిసిన తర్వాత, IRCTC, ఫైజర్, BPCL, విశాల్ మెగా మార్ట్, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, బ్రిగేడ్ ఎంటర్‌ప్రైజెస్‌లు స్టాక్ మార్కెట్ తమ వ్యాపార సంబంధిత సమాచారాన్ని అందించాయి.
FPI sales in August: భారత స్టాక్ మార్కెట్లో ఫారెన్ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. భారత్, అమెరికా వాణిజ్య ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి, నిరాశ పరిచిన క్యూ1 రిజల్ట్స్ దీనికి కారణమని తెలుస్తోంది. ఎఫ్ఐఐలు ఈక్విటీ షేర్లను అమ్మడంతో మార్కెట్ నష్టాల్లో ఉంది.
Tata Motors Q1 Results: టాటా కంపెనీకి ఇప్పుడంతా బ్యాడ్ టైం నడుస్తోంది. ఆ గ్రూప్ నకు చెందిన పలు కంపెనీలు లాభాలతోపా ఆదాయం కూడా భారీగా తగ్గుతున్నాయి. చాలా చోట్ల ఎదురుగాలే వీస్తోంది. టీసీఎస్ లేఆఫ్స్ ప్రకటన తీవ్రదుమారం రేపుతుండగా..ఇప్పుడు టాటా మోటార్స్ క్యూ 1 ఫలితాలను కూడా నిరాశపరిచాయి. భారీగా లాభం తగ్గింది. ఈ క్రమంలో టాటా కంపెనీ షేర్లు భారీగా కుప్పకూలుతున్నాయి.
HDFC Share Price: స్టాక్ మార్కెట్లో అద్భుతాలు చూడటం సర్వసాధారణమే. ఇన్వెస్టర్లకు ఊహించని విధంగా లాభాలు తెచ్చిపెట్టిన ఓ షేర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఈ షేర్ ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసింది.
Kalyan Jewellers: కల్యాణ్ జ్యూవెల్లర్స్ క్యూ 1 ఫలితాలు అంచనాలకు మించి అదరగొట్టాయి. మొదటి త్రైమాసికంలో రూ. 264కోట్ల లాభాన్ని ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో కంపెనీ లాభం 48.6శాతం మేర పెరిగింది. మూడేళ్లలో కల్యాణ్ జ్యువెల్లరీ కంపెనీ షేర్లు 730శాతం పెరిగాయి. షేర్ ధర 10 రెట్లు పెరిగింది. ఆగష్టు 7వ తేదీన కంపెనీ తన మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
Rahul Gandhi's stock portfolio: మీడియా సెక్టార్ కు చెందిన ప్రముఖ కంపెనీ వెర్టోజ్ లిమిటెడ్ షేర్లు మంచి ఫోకస్ లో ఉన్నాయి. ఒక్క ఏడాదిలో ఈ కంపెనీ షేర్లు ఏకంగా 164శాతం లాభాన్ని తమ షేర్ హోల్డర్స్ కు అందించింది. ఈ కంపెనీ గత నెలలో ఎక్స్ బోనస్ తో పాటు ఎక్స్ స్ప్లిట్ కూడా ట్రేడ్ చేసింది.