Archean chemicals: ఆర్కియన్ కెమికల్స్ ఐపీవోకు విశేష స్పందన, రేపే లాస్ట్ డేట్
Archean chemicals: షేర్ మార్కెట్‌లో ఇప్పుడు కొత్త ఐపీవోల సీజన్ కన్పిస్తోంది. విశేష స్పందన కన్పిస్తున్న ఆర్కియన్ కెమికల్స్ ఐపీవోకు రేపే చివరి రోజు. మీకు ఆసక్తి ఉంటే త్వరపడండి..
నవంబర్ నెలలో షేర్ మార్కెట్‌లో కొత్త ఐపీవోలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఆర్కియన్ కెమికల్స్ కొత్తగా ప్రవేశించింది. రేపటితో లాస్ట్ డేట్. విశేష ఆదరణ సంపాదిస్తున్న ఈ ఐపీవో వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్కియన్ కెమికల్స్ అనేది గుజరాత్‌కు చెందిన కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్లు కలిగిన ఆర్కియన్ కెమికల్స్ బ్రొమైన్, ఇండస్ట్రియల్ సాల్ట్, సల్ఫేట్ వంటి ప్రత్యేకత కలిగిన మెరైన్ కెమికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంటుంది. కొత్తగా ఐపీవో ప్రారంభించిన ఈ కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి 658 కోట్లు సమకూర్చుకుంది.
నవంబర్ 9వ ప్రారంభమైన ఈ కంపెనీ ఐపీవో నవంబర్ 11వ తేదీన క్లోజ్ కానుంది. అంటే రేపే ఈ ఐపీవోకు లాస్ట్ డేట్. ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ 386-407 రూపాయల మధ్యన ఉంటుంది. ఐపీవో ఒక్కొక్క లాట్‌లో 36 షేర్లు ఉంటాయి. రిటైల్ ఇన్వెస్టర్ల కేటగరీ నుంచి రెండోరోజే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. 1.61 కోట్ల ఈక్విటీ షేర్ల ద్వారా 805 కోట్లు సమకూర్చనుంది. నవంబర్ 21వ తేదీన ఈ షేర్ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయింది. ఈ కంపెనీ ఐపీవోకు రిలయన్స్ సెక్యూరిటీస్ సిఫారసు చేయడం విశేషం.
ఇది కాకుండా మరికొన్ని ఐపీవోలు కూడా వస్తున్నాయి. రుస్తుమ్ జీ గ్రూప్ కంపెనీ కీస్టోన్ రియల్టర్స్ త్వరలో ఐపీవో ద్వారా 635 కోట్ల రూపాయలు సమీకరించేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. యాంకర్ ఇన్వెస్టర్ షేర్ల కోసం నవంబర్ 11న ఆక్షన్ ఉంటుంది. ఈ ఇష్యూ నవంబర్ 14 నుంచి నవంబర్ 16 మధ్యలో ఉంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్‌బీఎఫ్‌సి ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీవో ద్వారా 1600 కోట్ల రూపాయలు సమీకరించనుంది. సెబికు ఇప్పటికే ప్రాధమిక డాక్యుమెంట్లు సమర్పించింది. మద్యం తయారు చేసే కంపెనీ సులా వైన్‌యార్డ్స్ ఐపీవో త్వరలో రానుంది. కంపెనీ ఐపీవోకు ఇప్పటికే సెబీ నుంచి అనుమతి లభించింది. కంపెనీ ఈ ఏడాది జూలైలో పబ్లిక్ ఇష్యూ కోసం డ్రాఫ్ట్ సిద్ధం చేసింది.
Also read: NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్ తీసుకోవాలంటే..ఏం చేయాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook