NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్ తీసుకోవాలంటే..ఏం చేయాలి

NPS Pension: సరైన ప్రణాళిక ఉంటే డబ్బులు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. ప్లానింగ్ కచ్చితంగా చేస్తే కోటీశ్వరులు కూడా కావచ్చు. రిటైర్మెంట్ తరువాత కూడా నెలకు పెద్దఎత్తున డబ్బులు సంపాదించే మార్గాలున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 10, 2022, 08:15 PM IST
NPS Pension: రిటైర్మెంట్ తరువాత నెలకు 2 లక్షల పెన్షన్ తీసుకోవాలంటే..ఏం చేయాలి

మీ వృద్ధాప్యాన్ని సంరక్షించే పథకాలు చాలా ఉన్నాయి. రిటైర్మెంట్ తరువాత కూడా నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ తీసుకునే అద్భుతమైన పధకం ఇది. ఆ వివరాలు మీ కోసం..

వృద్ధాప్యం ఖర్చుల కోసం ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు మీ వృద్ధాప్యాన్ని సెక్యూర్ చేయాలనుకుంటే..వృద్ధాప్యంలో డబ్బులకు ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవాలంటే..ఇప్పట్నించే ప్లానింగ్ అవసరం. రిటైర్మెంట్ కోసం డబ్బుల పొదుపు ఉద్యోగం ప్రారంభించిన రోజు నుంచే మొదలెట్టాలి.  సేవింగ్స్ ఎంత త్వరగా ప్రారంభిస్తే రిటైర్మెంట్ తరువాత అంత ఎక్కువగా డబ్బులు లభిస్తాయి. రిటైర్మెట్ ఫండ్ సమీకరించేందుకు ఈపీఎఫ్, ఎన్‌పిఎస్, షేర్ మార్కెట్, మ్యూచ్యువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటివి చాలానే ఉన్నాయి.

మీ రిటైర్మెంట్‌ను సురక్షితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలు ప్రారంభించింది. వీటిలో పెట్టుబడి పూర్తిగా సురక్షితమే కాకుండా మంచి రిటర్న్స్ అందుతాయి. మీరు ఉద్యోగులైతే..రిటైర్మెంట్ అనంతరం ప్రతినెలా పెన్షన్ తీసుకునే అవకాశముంటుంది. అయితే దీనికోసం ఇవాళ్టి నుంచే పెట్టుబడి ప్రారంభించాలి. తద్వారా 60 ఏళ్ల తరువాత మీ వృద్ధాప్యం సెక్యూర్ అవుతుంది.

ఎన్‌పిఎస్ పథకం అంటే ఏమిటి

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఒక ప్రభుత్వ పెన్షన్ పథకం. ఇందులో ఈక్విటీ, డెబ్ట్ ఇన్‌స్ట్రుమెంట్ రెండూ ఉన్నాయి. ఎన్‌పిఎస్ పథకానికి ప్రభుత్వ గ్యారంటీ లభిస్తుంది. రిటైర్మెంట్ అనంతరం నెలవారీ పెన్షన్ పొందేందుకు ఎన్‌పీఎస్ పథకం అద్భుతంగా పనిచేస్తుంది. 

ఇన్‌కంటాక్స్‌లో మినహాయింపు

ఎన్‌పిఎస్ పెన్షన్ పథకం అనేది పీపీఎఫ్, ఈపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజనలానే ప్రభుత్వ పధకం. ఇందులో మెచ్యూరిటీ నగదును సరిగా ఉపయోగిస్తే..నెలవారీ పెన్షన్ మొత్తం పెంచుకోవచ్చు. ఎన్‌పీఎస్ ద్వారా ఏడాదికి 2 లక్షల రూపాయల వరకూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల రూపాయల వరకూ ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల 50 వేల రూపాయలవరకూ అదనంగా ట్యాక్స్ మినహాయింపు కలుగుతుంది.

నెలవారీ పెన్షన్ 2 లక్షల రూపాయలు

ఎన్‌పిసీలో 40 ఏళ్ల వరకూ ప్రతి నెలా 5000 రూపాయలు జమ చేస్తే మెచ్యూరిటీ అనంతరం మీకు 1.91 కోట్ల రూపాయలు లభిస్తాయి. ఆ తరువాత మెచ్యూరిటీ నగదు పెట్టుబడిగా పెడితే నెలకు 2 లక్షల రూపాయలు పెన్షన్ లభిస్తుంది. సిస్టమెటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ నుంచి 1.43 లక్షల రూపాయలు, 63,768 రూపాయలు నెలకు రిటర్న్స్ లభిస్తాయి. ఇందులో ఇన్వెస్టర్ బతికున్నంతవరకూ పెన్షన్ లభిస్తుంది.

20 ఏళ్లలో 63,768 రూపాయలు పెన్షన్

20 ఏళ్ల వయస్సు నుంచి రిటైర్ అయ్యేంతవరకూ నెలకు 5000 రూపాయలు పెట్టుబడి పెడితే 1.91 కోట్ల నుంచి 1.27 కోట్ల వరకూ చేతికి అందుతుంది. ఆ తరువాత 6 శాతం రిటర్న్‌తో 1.27 కోట్ల రూపాయలపై ప్రతి నెలా 63,768 రూపాయలు పెన్షన్ లభిస్తుంది. 

ఎన్‌పిఎస్ రెండు రకాలుగా ఉంటుంది. ఎన్‌పిఎస్ టైర్ 1, ఎన్‌పిఎస్ టైర్ 2. టైర్ 1లో కనీస పెట్టుబడి 500 రూపాయలుంది. టైర్ 2లో 1000 రూపాయలుగా ఉంది. ఇందులో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. ఎన్‌పిఎస్‌లో పెట్టుబడికి 3 మార్గాలున్నాయి. ఈక్వీటీ, కార్పొరేట్ డేట్, ప్రభుత్వ బాండ్స్ ఇలా మూడు పద్దతులున్నాయి. ఈక్విటీలో రిటర్న్స్ ఎక్కువగా ఉంటుంది. 

Also read: LIC Scheme: ఆ ఎల్ఐసీ పధకంలో..నేరుగా కోటి రూపాయలు ప్రయోజనం, ఎలాగంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News