షేర్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో కొత్త కొత్త కంపెనీల  ఐపీవోలు వస్తున్నాయి. ఐపీవోలో పెట్టుబడికి ఆలోచిస్తుంటే ఇదే మంచి సమయం. ఇటీవల ఓపెన్ అయిన ఆ కంపెనీ షేర్..లిస్టింగ్ కాకముందే అందర్నీ ఆకర్షిస్తోంది. ఆ షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఐపీవో వచ్చేసింది. ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఐపీవో నవంబర్ 9న ప్రారంభమై..నవంబర్ 11న క్లోజ్ అయింది. ఇందులో డబ్బులు పెట్టుబడి పెట్టినవారంతా ఇప్పుడు షేర్ అలాట్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఐపీవోలో పెట్టుబడి పెట్టేవారికి ఇది మంచి న్యూస్. ఈ కంపెనీ షేర్ల అలాట్‌మెంట్ నవంబర్ 16వ తేదీన ఉంటుంది. గ్రే మార్కెట్‌లో ఈ షేర్ 85 రూపాయలు ప్రీమియంతో ట్రెండ్ అవుతోంది. అంటే ఆర్కియన్ కెమికల్ ఐపీవో లిస్టింగ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేయవచ్చు.


ప్రైస్ బ్యాండ్‌లో 20 శాతం పెరుగుదలకు అవకాశం


ఆర్కియన్ కెమికల్ ఐపీవో ప్రైస్ బ్యాండ్ 407 రూపాయలుంది. ఒకవేళ గ్రే మార్కెట్‌లో 85 రూపాయలు స్థిరంగా ఉంటే..ఈ షేర్ 492 రూపాయలకు లిస్ట్ కావచ్చు. అంటే షేర్ మార్కెట్‌లో ఐపీవో ప్రైస్ బ్యాండ్ 20 శాతం వృద్ధి నమోదు చేయవచ్చు. ఈ ఐపీవో ప్రైస్ బ్యాండ్ 386-407 రూపాయల వరకూ ఉంటుందని అంచనా ఉంది.


జీఎంపీ అంటే ఏమిటి


గ్రే మార్కెట్‌పై ఫోకస్ పెట్టే నిపుణులు ప్రకారం ఆర్కియన్ కెమికల్ ఐపీవో జీఎంపీ ప్రతి షేర్‌కు 85 రూపాయలుంది. ఇది క్రమంగా పెరుగుతోంది. నిపుణుల అంచనాల ప్రకారం..ఈ ఐపీవోలో పెట్టుబడి పెట్టేవారికి మంచి రిటర్న్స్ లభిస్తాయి. గ్రే మార్కెట్ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్ ఐపీవో విషయంలో పురోగతి కన్పిస్తోంది. 


Also read: Reliance Jio: దేశంలో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా 'రిలయన్స్‌ జియో'..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu      


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook