చాలామంది ఇన్వెస్టర్లకు మ్యూచ్యువల్ ఫండ్స్‌లో ఉండే రిస్క్ గురించి అవగాహన ఉండదు. అదే సమయంలో లాభాలు కూడా ఇస్తుంటాయి. ఐదేళ్లలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చిన మ్యూచ్యువల్ ఫండ్స్ ఏమున్నాయో పరిశీలిద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెట్టుబడి పెట్టేందుకు చాలామంది వివిధ మార్గాల్ని అనుసరిస్తుంటారు. ఈ విభిన్న మార్గాల్లో మ్యూచ్యువల్ ఫండ్ కూడా ఒకటి. మ్యూచ్యువల్ ఫండ్‌లో నిర్ణీత కాలవ్యవధిలో ఇన్వెస్టర్ పెట్టుబడి పెడుతుంటాడు. సాధారణంగా మ్యూచ్యువల్ ఫండ్స్, ఈక్విటీ షేర్స్‌లో రిస్క్ కచ్చితంగా ఉంటుంది. చాలామందికి రిస్క్ గురించి అవగాహన కూడా ఉండదు. అయితే అదే సమయంలో నిర్ణీత సమయం తరువాత రిటర్న్స్ కూడా అందుతుంటాయి. ఐదేళ్ల వ్యవధిలో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాల్ని ఇచ్చిన ఐదు ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం..


అద్బుత లాభాల్ని ఇచ్చి న 5 ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్స్


Canara Robeco Bluechip Equity Fund గత ఐదేళ్లలో అద్భుతమైన ఫలితాల్ని సాధించిన లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచ్యువల్ ఫండ్ స్కీమ్. కెనరా రొబెకో బ్లూ చిప్ ఈక్విటీ ఫండ్ డైరెక్ట్ ప్లాన్..15.03 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇందులోనే రెగ్యులర్ ప్లాన్ 5 ఏళ్లలో 13.48 శాతం రిటర్న్ అందించింది. ఈ ఫండ్ ఎస్అండ్‌పి బీఎస్ఈ 100 గత ఐదేళ్లలో 13 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ పథకంలో రిస్క్ చాలా ఎక్కువ.


Axis Bluechip Fund ఇందులో డైరెక్ట్ ప్లాన్ 14.16 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అటు రెగ్యులర్ ప్లాన్ 5 ఏళ్లలో 12.75 శాతం రిటర్న్స్ అందించింది. ఫండ్ ఎస్ఎండ్‌పి బీఎస్ఈ 100 అనేది 5 ఏళ్లలో 13 శాతం రిటర్న్స్ అందించింది. ఇందులో కూడా రిస్క్ చాలా ఎక్కువ.


Edelweiss Large Cap Fund ఇందులో డైరెక్ట్ ప్లాన్ 13.25 శాతం లాభాల్ని అందించింది. అటు ఈ స్కీమ్‌లో రెగ్యులర్ ప్లాన్ గత ఐదేళ్లలో 11.76 శాతం రిటర్న్ ఇచ్చింది. ఫండ్ నిఫ్టీ 100 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ గత ఐదేళ్లలో 12.8 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఇందులో కూడా రిస్క్ చాలా ఎక్కువ.


Kotak Bluechip Fund ఇందులో డైరెక్ట్ ప్లాన్ 13.24 శాతం రిటర్న్ అందించగా..ఇదే స్కీమ్‌లో రెగ్యులర్ ప్లాన్ గత ఐదేళ్లలో 11.91 శాతం రిటర్న్ ఇచ్చింది. ఫండ్ నిఫ్టీ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ గత ఐదేళ్లలో 12.8 శాతం రిటర్న్ అందించింది. ఇందులో కూడా రిస్క్ చాలా ఎక్కువ.


UTI Mastershare Fund ఇందులో డైరెక్ట్ ప్లాన్ 13.23 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అటు ఇదే మ్యూచ్యువల్ ఫండ్ స్కీమ్‌లో రెగ్యులర్ ప్లాన్ 5 ఏళ్లలో 12.23 శాతం రిటర్న్స్ అందించింది. ఫండ్ ఎస్ఎండ్‌పి బీఎస్ఈ 100 టోటల్ రిటర్న్ ఇండెక్స్ గత ఐదేళ్లలో 13 శాతం రిటర్న్ అందించింది. ఇందులో కూడా రిస్క్ చాలా ఎక్కువ.


Also read: Bullish Stock: అక్టోబర్ నెలలో భారీగా వృద్ధి నమోదు చేసిన మూడు బ్యాంకు షేర్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook