IPO Updates: వచ్చేవారం 2 వేల కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమౌతున్న మూడు ఐపీవోలు ఇవే
IPO Updates: షేర్ మార్కెట్ అనేది ఓ లోతైన ప్రపంచం. సరిగ్గా అర్ధం చేసుకుంటే లక్షలు ఆర్జించవచ్చు. వచ్చేవారం స్టాక్ మార్కెట్‌లో మూడు కంపెనీల ఐపీవోలు రానున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
షేర్ మార్కెట్‌లో కొన్ని కంపెనీలు షేర్లు అమాంతం లాభాలు ఆర్జిస్తే..మరికొన్ని కంపెనీల షేర్లు నష్టపోతుంటాయి. అయినా నిత్యం కొత్త కొత్త కంపెనీలు షేర్ మార్కెట్‌లో ఎంట్రీ ఇస్తూనే ఉంటాయి. ఇప్పుడు మరో మూడు కంపెనీల షేర్లు ప్రారంభం కానున్నాయి.
వచ్చేవారం 1858 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా మూడు కంపెనీల ఐపీవోలు రానున్నాయి. బయట మార్కెట్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఐపీవోల ద్వారా నిధులు సమీకరించడం సులభం. కానీ ఈ మూడు కంపెనీల ఐపీవోలు మాత్రం వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు వెలువడుతున్నాయి.
ప్రముఖ వైన్ తయారీ కంపెనీ సులా వైన్‌యార్డ్స్ ఐపీవో ఈ నెల 12-14 వస్తోంది. మొత్తం 960.35 కోట్ల నిధులకై ఐపీవో విడుదలవుతోంది. ఈ కంపెనీ షేర్ 340-357గా నిర్ణయించింది. మార్కెట్‌లో ప్రస్తుతం సులా వైన్‌యార్డ్స్ అగ్రస్థానంలో ఉంది. ఇక రెండవ కంపెనీ ప్రముఖ ఆర్ధిక సేవల సంస్థ అబాన్స్ హోల్డింగ్స్. ఈ కంపెనీ 345.6 కోట్ల సమీకరించనుంది. షేర్ విలువ 256-270 రూపాయలుండవచ్చు. ఈ కంపెనీ ఐపీవో ఈ నెల 13-15 తేదీల మధ్య రానుంది. ఇండియాతో పాటు యూకే, సింగపూర్, యూఏఈ, చైనా, మారిషస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీ, ఐపీవో నిధులను భవిష్యత్తు పెట్టుబడులు, మూలధన అవసరాలు తీర్చేందుకు, సాధారణ కార్పొరేట్ వ్యవహారాల కోసం వినియోగించనున్నారు.
ఇక మరో కంపెనీ ఆటోమొబైల్ డీలర్‌షిప్ చెయిన్ ల్యాండ్‌మార్క్ కార్స్. ఈ కంపెనీ మొత్తం 150 కోట్ల విలువైన కొత్త షేర్లతోపాటు 4.2 కోట్లు విలువైన ఆఫర్ ఫర్ సేల్ కింద సమీకరించనుంది. ఈ కంపెనీ ధర 481-506 రూపాయలుండనుంది.
Also read: Share Market Updates: జీతం కాకుండా నెలకు 30 వేలు సంపాదించే షేర్ మార్కెట్ చిట్కాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook