Share Market Updates: జీతం కాకుండా నెలకు 30 వేలు సంపాదించే షేర్ మార్కెట్ చిట్కాలు

Share Market Updates: అదనపు అదాయం.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ అవసరమైంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చు. జీతం కాకుండా ప్రతినెలా అదనంగా 30 వేల రూపాయలు సంపాదించే ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 11, 2022, 04:17 PM IST
Share Market Updates: జీతం కాకుండా నెలకు 30 వేలు సంపాదించే షేర్ మార్కెట్ చిట్కాలు

షేర్ మార్కెట్‌లో ప్రతి ఒక్కరూ ఆదాయం సంపాదించే ఉద్దేశ్యంతోనే పెట్టుబడి పెడుతుంటారు. షేర్ మార్కెట్‌లో సంపాదించే అవకాశం ఎవరికైనా లభిస్తుంది. మార్కెట్ పరిస్థితిని అంచనా వేస్తూ పెట్టబడులు పెడుతుండాలి. 

జీతం కాకుండా ప్రతినెలా అదనంగా సంపాదన ఉండాలంటే షేర్ మార్కెట్ ఒక్కటే మంచి ప్రత్యామ్నాయం. ఎందుకంటే అదనపు ఆదాయం అనేది ప్రతి ఒక్కరికీ కావాలని ఉంటుంది. మార్కెట్‌లో డబ్బులు పెట్టుబడి పెట్టడం వల్ల కోరిన ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. జీతం కాకుండా అదనంగా నెలకు 30 వేలు కూడా సంపాదించుకునే మార్గాలున్నాయి. 

నెలలో శని, ఆదివారాలు షేర్ మార్కెట్ ఉండదు. ఈ రోజుల్లో షేర్ మార్కెట్ సెలవుగా పరిగణిస్తారు. అంటే షేర్ మార్కెట్ ప్రకారం నెలకు 22 రోజులే ఉంటాయి. ఇక మరో రెండ్రోజులు ఏదైనా ఇతర సెలవులుంటే..ఇక మిగిలింది 20 రోజులే ఉంటుంది. అంటే ఈ  20 రోజుల్లో 30 వేలు సంపాదించాలంటే..రోజుకు 1500 రూపాయలు సంపాదించాల్సి ఉంటుంది. షేర్ మార్కెట్ ట్రేడింగ్ ద్వారా రోజుకు 1500 రూపాయలు సంపాదించాలి. 

షేర్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏ షేర్లతో పెట్టుబడి పెడుతున్నారో..ఆ షేర్లు, పెట్టుబడి నగదుతో కూడా ప్రభావం ఉంటుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మార్కెట్ ఎలా ఉందనేది కనిపెట్టుకుని ఉండాలి. దాంతోపాటు ట్రేడింగ్‌లో అత్యాశ మంచిది కానేకాదు. రోజుకు కావల్సిన నిర్ణీత సంపాదనే ధ్యేయంగా ఉండాలి. 

Also read: Pm Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..? ఇప్పుడే ఇలా అప్లై చేసుకోండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News