Gold Price Today: బంగారం ప్రియులకు కాస్త ఊరటనిచ్చే విషయం. నిన్నటి వరకూ పెరుగుతూ పోయిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ బంగారం ధరలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతర్దాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు(Gold Price Today)ప్రతిరోజూ ఒకేలా ఉండవు. మార్కెట్‌లో ఉన్న పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి. ముఖ్యంగా  కేంద్ర బ్యాంకుల్లో ఉండే బంగారం నిల్వలు.. ఆ బంగారంపై వర్తించే వడ్డీ వంటి అంశాలు పసిడి ధరలపై ప్రభావం చూపుతాయి. గత కొద్దిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఇవాళ మాత్రం బంగారం ధర కాస్త తగ్గింది. ఎక్కడెంత ధర ఉందో తెలుసుకుందాం.


దేశీయంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45 వేల 750 కాగా, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల 910 రూపాయులుంది. దేశంలోని వివిధ నగరాల్లో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 49 వేల7 వందలైతే, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 250గా ఉంది. దేశంలో అన్నింటికంటే ఢిల్లీలోనే అత్యధికంగా ఉంది. అటు హైదరాబాద్‌లో(Gold Price in Hyderabad)పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45 వేల 750 కాగా, పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 52 వేల 250గా ఉంది. ఇక చెన్నైలో ఇవాళ పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల 220గా ఉంది. అదే సమయంలో 24 క్యారెట్ల బంగారం ధర 50 వేల 420గా ఉంది. అటు ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48 వేల 270 అయితే, 24 క్యారెట్ల బంగారం ధర 49 వేల 270 రూపాయలుంది. విశాఖపట్నం, విజయవాడ మార్కెట్‌లో కూడా బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌తో సమానంగా ఉంది. విశాఖపట్నం, విజయవాడలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45 వేల 750 రూపాయలైతే..పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం దర 49 వేల 910 రూపాయలుగా ఉంది. 


Also read: 'క్రిప్టోల్లో పెట్టబడి పెట్టలేదు- ఆ వార్తలన్ని అవాస్తవం'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook