Smartphones Launching in August 2023: ఈ ఏడాదిలోనే జనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కొన్ని స్మార్ట్‌ఫోన్స్ ఈ జులై నెలలో లాంచ్ అయ్యాయి. శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 5, శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 5, నథింగ్ ఫోన్ వంటి మొబైల్స్ ఆ జాబితాలోనివే అనే విషయం తెలిసిందే. కానీ ఇంతటితోనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ లాంచింగ్ కథ ముగిసిపోలేదు. ఈ ఆగస్టు నెలలో లాంచ్ అవడానికి సిద్ధంగా ఉన్న స్మార్ట్‌ఫోన్స్ సైతం ఉన్నాయి. ఆగస్ట్ 2023లో లాంచ్ అవుతున్న స్మార్ట్‌ఫోన్స్ డీటేల్స్ విషయానికొస్తే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెడ్ మి 12 5G: షావోమి సబ్-బ్రాండ్ అయిన రెడ్ మి కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న స్మార్ట్ ఫోన్ మోడల్ రెడ్ మి 12 5G. రెడ్ మి కంపెనీ షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 1న ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. మిడ్ లెవెల్ సెగ్మెంట్‌లో బయ్యర్స్‌ని ఊరిస్తూ వస్తోన్న రెడ్ మి 12 5G స్మార్ట్‌ఫోన్ ధర సుమారు రూ. 10,000 లకు కాస్త అటుగా ఉండవచ్చు అని ఒక అంచనా. ఈ స్మార్ట్‌ఫోన్ 6GB RAM + 128GB, 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో వచ్చే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


మోటో G14: రెడ్ మి 12 ఫోన్‌కి పోటీగా మోటోరోలా లాంచ్ చేస్తోన్న మోటో G14 ఫోన్ కూడా ఆగష్టు 1నే విడుదల అవనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. 6.5 అంగుళాల FHD+ డిస్‌ప్లేతో, 20W టర్బో పవర్ ఛార్జింగ్‌తో వస్తోంది. ఇందులో 5,000mAh బ్యాటరీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేకి తగినట్టుగానే అద్భుతమైన సౌండ్ ఆస్వాదించేందుకు వీలుగా ఇందులో డాల్బీ అట్మాస్ స్పీకర్స్ కూడా ఉండే అవకాశం ఉంది అని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 10,000 నుండి రూ 11,000 వరకు ఉండే అవకాశం ఉంది. 


షావోమి మిక్స్ ఫోల్డ్ 3: షావోమి నుంచి మిక్స్ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌ కూడా ఈ ఆగస్టులోనే లాంచ్ కానున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే, ఈ ఫోన్ లాంచింగ్ కోసం ఇంకా సరైన తేదీ ఖరారు కాలేదు. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాడ్ కెమెరా సెటప్‌తో ఉండనుందని తెలుస్తోంది. 


ఇది కూడా చదవండి : Defective ITR: డిఫెక్టివ్ ఐటిఆర్ అంటే ఏంటి ? దీంతో నష్టమా ?


శాంసంగ్ గెలాక్సీ F34 5G: శాంసంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి రానున్న మరో బెస్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ ఉంటుంది అని శాంసంగ్ చెబుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌లో నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ కోసం 6,000mAh బ్యాటరీ, 50MP నో-షేక్ కెమెరా అమర్చే అవకాశాలు ఉన్నాయి.


వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో : వన్‌ప్లస్ కంపెనీ ఈ ఆగస్ట్‌ నెలలో వన్‌ప్లస్ ఓపెన్, వన్‌ప్లస్ ఏస్ 2 ప్రో పేర్లతో రెండు స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేయనుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకాసేపట్లో అప్‌డేట్ అవుతాయి.


ఇది కూడా చదవండి : Honda Elevate Car Review: హోండా ఎలివేట్ కారు రివ్యూ.. ధర, ఫీచర్స్. మైలేజ్ వివరాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి