Budget 2022: కరోనా సహా ద్రవ్యోల్బణం పెరగటం వంటి కారణాలతో గత కొంతకాలంగా కన్జూమర్​ డ్యూరబుల్స్​, ఎలక్ట్రానిక్స్​ మార్కెట్​లు ఒడుదొడుకులు (Corona impact on consumer durables market) ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్​పై ఈ మార్కెట్లు భారీ అంచనాలు పెట్టుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో.. మన్నికైన వస్తువులు, ఎలక్ట్రానిక్ డివైజ్​ల తయారీ సంస్థల నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగాయి. దీనితో బడ్జెట్​ 2022లో ఉపశమనం కోరుకుంటున్నాయి (Consumer durables market on Budget 2022) పరిశ్రమ వర్గాలు.


ముఖ్యంగా కన్జూమర్​ డ్యూరబుల్స్​, మొబైల్ ఫోన్ల విడిభాగాలపై దిగుమతి సుంకాలు తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోంది. దీనితో పాటు కస్టమ్స్ నిబంధనలను కూడా సరళీకరించాలని పరిశ్రమ వర్గాలు (Demand for budget 2022) కోరుతున్నాయి.


కరోనా పరిస్థితుల దృష్ట్య డిమాండ్ పెంచేందుకు.. కేంద్రం సుంకాల తగ్గింపుతో పాటు నిబంధనలను సరళిస్తే.. ఏప్రిల్​ తర్వాత స్మార్ట్​ఫోన్లు, స్మార్ట్​వాచ్​లు, టీవీలు, ఫ్రిడ్జ్​ల ధరలు కాస్త తగ్గే (Smartphone prices down) అవకాశముంది.


ధరలు తగ్గకపోయినా.. ఇప్పట్లో మరింత పెరగకుండా మాత్రం ఈ నిర్ణయం ఉపయోగపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ విషయంపై బడ్జెట్​లో ఎలాంటి నిర్ణయాలు వెలువడుతాయో వేచి చూడాలి.


ఈ సారి బడ్జెట్ ఇలా..


ఈ నెల 31 నుంచే 2022-23 బడ్జెట్ (Budget 2022) సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సారి పేపర్​ లెస్​ బడ్జెట్​ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. ఫిబ్రవరి 1న పద్దును పార్లమెంట్​ ముందుకు తీసుకురానున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​.


అంతకు ముందు జనవరి 31న ఆర్థిక సర్వేను (Economic Survey 2022) ప్రవేశ పెట్టనున్నారు ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు. గత ఆర్థిక సంవత్సరం తీసుకున్న నిర్ణయాలు, సాధించిన ఫలితాలతో కూడుకున్నదే ఈ ఆర్థిక సర్వే.


Also read: Redmi note 11 pro 5g: రెడ్‌మి నోట్ 11 ప్రో 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..


Also read: EPFO Money withdraw: ఉమంగ్ యాప్ ద్వారా కొవిడ్-19 అడ్వాన్స్ ఇలా డ్రా చేయండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook