Redmi note 11 pro 5g: రెడ్‌మి నోట్ 11 ప్రో 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..

Redmi note 11 pro 5g: రెడ్​మీ నోట్​ సిరీస్​లో 11 ప్రో 5జీ వేరియంట్​ను విడుదల చేసింది షియోమీ. ఈ ఫోన్​ ధర, ఫీచర్ల పూర్తి వివరాలు మీ కోసం.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 07:38 PM IST
  • మార్కెట్లోకి రెడ్​మీ నోట్ 11 ప్రో 5జీ
  • వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభం
  • భారీ కెమెరా, అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
Redmi note 11 pro 5g: రెడ్‌మి నోట్ 11 ప్రో 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..

Redmi note 11 pro 5g: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం షియోమీ.. రెడ్​ మీ సరీస్​లో కొత్త స్మార్ట్​ఫోన్​ను గ్లోబల్​ మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్​ మీ నోట్ 11 ప్రో 5జీ పేరుతో ఈ ఫోన్​ను మార్కెట్లోకి (Redmi note 11 pro 5g launched) ఆవిష్కరించింది.

ఈ ఫోన్​లో 108 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, హైపర్ ఛార్జింగ్​ ఫీచర్లు ప్రధానమైనవి.

ధర ఎంతంటే..?

రెడ్​మీ 11 ప్రో 5 జీ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

6 జీబీ ర్యామ్​, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 330 డాలర్లు (సుమారు రూ.24,600)గా నిర్ణయించింది కంపెనీ.

8 జీబీ ర్యామ్​, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 380 డాలర్లు (దాదాపు రూ.28,400)గా ఉంచుంది (Redmi note 11 pro 5g Price) షియోమీ.

రెడ్​మీ 11 ప్రో 5 జీ ఫీచర్లు(Redmi note 11 pro 5g features)..

  • 6.67 అంగుళాల ఫుల్ హెచ్​డీ డిస్​ప్లే
  • మీడియాటెక్​ హీలియో జీ9 ప్రాసెసర్​
  • 108 మెగా పిక్సెల్ మెయిన్​ కెమెరాతో వెనుకవైపు నాలుగు కెమెరాలు (108 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ+2 ఎంపీ)
  • 5,000 ఎంఏహెచ్​ బ్యాటరీ
  • 67 వాట్స్​ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​
  • సైడ్ మౌట్ ఫింగర్ ప్రిట్​

ఈ ఫోన్​ ఇండియా మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనే విషయంపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకట విడుదల చేయలేదు.

గ్లోబల్​ మార్కెట్లో వచ్చే నెల నుంచి విక్రయాలు ప్రారంభం (Redmi note 11 pro 5g sles) కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సరీస్​ను త్వరలోనే భారత్​లో విడుదల చేసే అవకాశముందని టెక్ వార్తా సంస్థలు (Redmi note 11 pro 5g in India) అభిప్రాయపడుతున్నాయి.

Also read: EPFO Money withdraw: ఉమంగ్ యాప్ ద్వారా కొవిడ్-19 అడ్వాన్స్ ఇలా డ్రా చేయండి..

Also read: Budget 2022: కేంద్ర బడ్జెట్ 2022 కోసం ప్రత్యేక యాప్​.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News