Splendor Plus XTEC Bike Price: ప్రముఖ మోటర్‌ సైకిల్ కంపెనీ హీరో గుడ్ న్యూస్‌ తెలిపింది. ఈ మోటర్ సైకిల్ స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 పేరుతో మార్కెట్‌లోకి లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. హీరో 30వ వార్షికోత్సవ ఈవేంట్‌లో భాగంగా ఈ మోటర్‌ సైకిల్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా ఈ బైక్‌ను కంపెనీ ప్రత్యేకమైన ఆఫర్స్‌ భాగంగా విక్రయిస్తోంది. అయితే  ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ XTEC 2.0 మోటర్‌ సైకిల్‌ను కంపెనీ ధర రూ.82,911తో విక్రయిస్తోంది. అలాగే 30వ వార్షికోత్సవం సందర్భంగా ఆకర్శనీయమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం Splendor Plus XTEC మోటర్‌ సైకిల్‌ మాట్ గ్రే, గ్లోస్ బ్లాక్‌తో పాటు గ్లోస్ రెడ్ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది.  ఈ బైక్‌ HIPL (హై ఇంటెన్సిటీ పొజిషన్ ల్యాంప్)తో కూడిన LED హెడ్‌లైట్‌ సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు మెరుగైన హెడ్‌లైట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా H-ఆకారపు సిగ్నేచర్ టెయిల్ ల్యాంప్‌ సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. 


ఈ మోటార్‌సైకిల్‌ ఎంతో శక్తివంతమైన 100cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంజన్‌ 8000 RPM, 7.9 BHPలతో వస్తోంది. అంతేకాకుండా ఇది  8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఈ బైక్‌ మైలేజీ వివరాల్లోకి వెళితే, ఇది 73 km/l మైలేజీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఈ మోటర్‌సైకిల్ స్ప్లెండర్ i3s (ఐడిల్ స్టాప్ స్టార్ట్ సిస్టమ్) టెక్నాలజీతో అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు 6000 కి.మీ సర్వీస్ ఇంటర్వెల్ సెటప్‌ను కూడా అందిస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇక ఈ బైక్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ఇది ఎకో-ఇండికేటర్‌తో కూడిన డిజిటల్ స్పీడోమీటర్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు RTMI (రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్)తో వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన బ్లూటూత్ కనెక్టివిటీ సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ బైక్‌కి బ్యాటరీ అలర్ట్, సర్వీస్ రిమైండర్ వంటి ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు USB ఛార్జర్, హజార్డ్ లైట్లు వంటి సెటప్‌లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సైడ్-స్టాండ్ ఇంజన్ కటాఫ్ ఫంక్షన్ సెటప్‌తో మార్కెట్‌లోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి