SBI charges: ఎస్బీఐ ఐఎంపీఎస్ లిమిట్ పెంపు- కొత్త పరిమితి, ఛార్జీలు ఇవే..
SBI charges: దేశీయ అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ వినియోగదారులకు అలర్ట్. ఐఎంపీఎస్ లావాదేవీల ఛార్జీల్లో స్వల్ప మార్పులు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
SBI charges: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఐఎంపీఎస్ (ఇమీడియట్ పేమెంట్ సర్వీస్) సేవలకు విధించే ఛార్జీల్లో స్వల్ప మార్పులు చేసింది. బ్యాంక్ తాజా నిర్ఱయం ప్రకారం.. తక్షణమే (ఫిబ్రవరి 1) ఈ ఛార్జీలు అమలులోకి రానున్నాయి.
పరిమితి పెంపు..
ఐఎంపీఎస్ ద్వారా లావాదేవీల పరిమితి కూడా పెంచింది ఎస్బీఐ. ఇప్పటి వరకు ఐఎంపీఎస్ ద్వారా రూ.2 లభల వరకు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటగా.. ఇకపై ఆ పరిమితి రూ.5 లక్షలకు పెరిగింది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ ఈ లావాదేవీలు జరిపేందుకు వీలుంది.
ఐఎంపీఎస్ ఛార్జీలు ఇలా..
ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు మాత్రమే ఈ ఛార్జీలు వర్తిస్తాయి. అంటే ఎవరైనా ఖాతాదారుడు బ్యాంకుకు వెళ్లి ఈ సేవలను వినియోగించుకుంటే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
రూ.1000 వరకు చేసే ఐఎంపీఎస్ లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వర్తించవు.
రూ.1000 దాటి.. రూ.10 వేల వరకు చేసే లావాదేవీలకు రూ.2+ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.
రూ.10,000 దాటి.. రూ.1,00,000 వరరకు చేసే లావాదేవీలకు రూ.4+జీఎస్టీ వర్తిస్తుంది.
రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు మధ్య జరిపే లావాదేవీలకు రూ.12+జీఎస్టీ ఛార్జీగా నిర్ణయించింది ఎస్బీఐ.
(రూ.1000 నుంచి రూ.లక్ష వరకు ఇంతకు ముందు కూడా ఇవే ఛార్జీలు ఉండటం గమనార్హం.)
రూ.2 లక్షలు దాటి.. రూ.5 లక్షల వరకు జరిపే లావాదేవీలకు రూ.20 ఛార్జీ వసూలు చేయనుంది ఎస్బీఐ. దీనికి జీఎస్టీ అదనం.
Also read: LIC Policy: కోటి రూపాయలు తెచ్చిపెట్టే ఎల్ఐసి పాలసీ
Also read: Economic Survey 2022: ఆటోమొబైల్ రంగానికి చిప్‌ల దెబ్బ: ఆర్థిక సర్వే 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook