LIC New Scheme: ప్రస్తుతం బ్యాంక్ డిపాజిట్స్ చేసుకుంటే పెద్దగా లాభాలేమీ రావట్లేదు. ఇలాంటి సందర్భంలో ఎల్‌ఐసీ ప్లాన్స్ చాలా ప్రయోజనకరంగా మారాయి. ఎల్‌ఐసీకి సంబంధించిన ఒక స్కీమ్ ద్వారా చాలా తక్కువ టైమ్‌లోనే మంచి లాభం పొందొచ్చు.
జస్ట్ నాలుగు ప్రీమియంలు (Premium) చెల్లిస్తే చాలు.. తర్వాత కోటి రూపాయల వరకు తిరిగి పొందే అవకాశం ఉంది. ఎల్‌ఐసీకి చెందిన శిరోమణి ప్లాన్‌తో మంచి లాభాలు పొందొచ్చు.
ఎల్‌ఐసీ లైఫ్ శిరోమణి ప్లాన్ (ఎల్‌ఐసీ జీవన్ శిరోమణి ప్లాన్) (LIC Life Shiromani Plan) లబ్ధిదారులు అత్యధిక డిసీజ్ కవరేజీని కలిగి ఉంటారు. ఈ ప్లాన్ టర్మ్‌లు.. గరిష్టంగా నాలుగు లెవెల్స్‌కు సెట్ చేసి ఉంటాయి. 14, 16, 18, 20 ఏళ్ల వరకు పాలసీ టర్మ్‌లు ఉంటాయి.
ఈ పాలసీ (Policy) తీసుకోవాలంటే సంబంధించి కనీస వయస్సు 18 సంవత్సరాలుండాలి. అలాగే 55 ఏళ్లకు మించకూడదు. ఈ ప్లాన్‌తో కనీస హామీ రూ. 1 కోటి వరకు లభిస్తుంది. ఇక పాలసీదారుడు (Policyholder) రుణం, సర్వైవల్ బెనిఫిట్స్ పొందాలంటే మాత్రం తప్పనిసరిగా నాలుగు సంవత్సరాల కాలపరిమితికి డిపాజిట్స్ చేయాల్సి ఉంటుంది.
14 సంవత్సరాల పాలసీకి సంబంధించి.. పదో సంవత్సరంలో అలాగే పన్నెండో ఏడాది పూర్తయినప్పుడు బేసిక్ సమ్ అష్యూర్డ్ నుంచి 30శాతం పొందే వీలుంటుంది. అలాగే 16 సంవత్సరాల పాలసీకి సంబంధించి.. 12వ సంవత్సరం అలాగే 14 సంవత్సరాల సమయంలో 35శాతం సమ్ అష్యూర్డ్ నుంచి పొందొచ్చు. అలాగే 18 సంవత్సరాల పాలసీకి సంబంధించి... 14వ ఏట, అలాగే 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సమ్ అష్యూర్డ్ నుంచి 40శాతం పొందొచ్చు.
ఇక 20 సంవత్సరాల పాలసీకి సంబంధించి అయితే 16, 18 ఏళ్లు పూర్తయ్యే క్రమంలో 45 శాతం బేసిక్ సమ్ అష్యూర్డ్ (Basic Sum Assured) నుంచి పొందొచ్చు. ఈ జీవన్ శిరోమణి పాలసీ (Policy) కోసం కావాల్సిన ధ్రువపత్రాలను తప్పనిసరిగా పాలసీ విభాగానికి ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ఫ్రూఫ్, ఫోటో, బ్యాంక్ (Bank) ఖాతా తదితర సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది.
Also Read: Bheemla Nayak Release Date: భీమ్లా నాయక్ సినిమా విడుదలపై మేకర్స్ కీలక ప్రకటన.. రిలీజ్ ఎప్పుడంటే?
Also Read: Economic Survey 2022: ఆటోమొబైల్ రంగానికి చిప్‌ల దెబ్బ: ఆర్థిక సర్వే 2022
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook