SBI Cash Withdrawal Latest Rule: ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్. ఏటీఎం నుంచి నగదు విత్ డ్రా నియమాలను మార్చింది. ఇక నుంచి ఏటీఎం నుంచి నగదు తీసుకోవడానికి ఓటీపీ నంబర్ ఎంటర్ చేయాల్సిందే. ఈ నంబర్‌ను నమోదు చేయకపోతే మీ నగదు చేతికి రాదు. ఏటీఎం లావాదేవీలను మరింత సురక్షితంగా చేయడానికి బ్యాంక్ ఈ చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఏటీఎం నుంచి ఓటీపీ లేకుండా కస్టమర్ తీసుకోవడం సాధ్యం కాదు. నగదు ఉపసంహరణ సమయంలో ఖాతాదారులకు వారి మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఇది ఏటీఎం నుంచి నగదు తీసుకునే సమయంలోనే పనిచేస్తుంది. మీ నంబరుకు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి నగదు విత్ డ్రా చేసుకోండి. 


ఈ నిబంధన గురించి బ్యాంకు ఇప్పటికే వినియోగదారులకు వివరించింది. 'ఎస్బీఐ ఎటీఎంలలో లావాదేవీల కోసం మా ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ ప్రవేశ పెడుతున్నాం. పెరుగుతున్న మోసాలను అరికట్టేందుకు ఓటీపీ విధానం ఎంతో ఉపయోగపడుతుంది. మోసాల నుంచి వినియోగదారుల నుంచి రక్షించడమే మా లక్ష్యం. ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థ ఎలా పని చేస్తుందో వినియోగదారులు తెలుసుకోవాలి..' అని ఎస్బీఐ అధికారులు సూచిస్తున్నారు. 


ఇటీవల ఏటీఎంల వద్ద మోసాలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేసేందుకు రూ.10 వేల కంటే ఎక్కువ విత్‌డ్రాపై బ్యాంక్ కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఖాతాదారులకు వారి బ్యాంక్ ఖాతా, వారి డెబిట్ కార్డ్ పిన్ నుంచి వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీ ద్వారా ప్రతిసారీ వారి ఏటీఎం నుంచి రూ.10 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంక్ అనుమతిస్తుంది. 


నగదు విత్ డ్రా కోసం ఇలా చేయండి..


  • మీరు ఏటీఎంలో విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేసిన అడుగుతుంది.

  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

  • ఈ ఓటీపీ నాలుగు అంకెల సంఖ్యగా ఉంటుంది. ఇది ఒకే లావాదేవీ కోసం మాత్రమే పనిచేస్తుంది.

  • తర్వాత మీరు ATM స్క్రీన్‌పై OTPని నమోదు చేయమని అడుగుతారు.

  • నగదు ఉపసంహరణ కోసం  స్క్రీన్‌లో మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి. 

  • ఆ తరువాత డబ్బు మీ చేతికి వస్తుంది


Also Read: IPL 2023 Released Players: కాసుల వర్షం కురిపించి మొఖం చాటేశారు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి


Also Read: Pakistan Love Story:  మార్నింగ్ వాక్‌తో మొదలైన ప్రేమకథ.. 70ఏళ్ల వృద్ధుడిని పెళ్లి చేసుకున్న టీనేజ్ అమ్మాయి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook