SBI Interest Rate Hike: ఎస్బీఐ ఖాతాదారులకు షాక్.. నేటి నుంచే అమలు
SBI MCLR Hike: మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను ఎస్బీఐ 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులకు షాక్ తగిలింది. ఇక నుంచి ఈఎంఐ రేట్లు మరింత పెరగున్నాయి. పూర్తి వివరాలు ఇవిగో..
SBI MCLR Hike: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. నేటి నుంచి ఎస్‌బీఐ లోన్లపై వడ్డీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఎస్‌బీఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR)ను 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో కోట్లాది మంది బ్యాంకు ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. బ్యాంకు నుంచి తీసుకునే అన్ని లోన్లపై వడ్డీ రేట్ల మరింత ప్రియం కానున్నాయి. ఇది కాకుండా ఇప్పటికే గృహ రుణం తీసుకున్న వారు కూడా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఈ నిర్ణయం తరువాత కొత్త, పాత కస్టమర్లు ఇద్దరూ ప్రభావితమవుతారు.
రెపో రేటులో 2.25 శాతం పెరుగుదల
MCLR పెరుగుదలకు సంబంధించిన సమాచారం బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడిచింది. గతంలో ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన తర్వాత బ్యాంకు నుంచి వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో సెంట్రల్ బ్యాంక్ నిర్వహించిన MPC సమావేశంలో రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం మీకు తెలిసిందే. దీని రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. మే నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 2.25 శాతం పెంచింది.
MCLR బాగా పెరిగింది
ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఒకటి నుంచి మూడు నెలల వరకు ఎంసీఎల్‌ఆర్ 7.75% నుంచి 8 శాతానికి పెరిగింది. ఆరు నెలల నుంచి ఏడాదికి ఎంసీఎల్‌ఆర్‌ను 8.05% నుంచి 8.30 శాతానికి పెంచారు. రెండేళ్లలో ఎంసీఎల్ఆర్ 8.25% నుంచి 8.50 శాతానికి పెరిగింది. మూడేళ్లలో చూసుకుంటే.. ఎంసీఎల్‌ఆర్ 8.35% నుంచి 8.60 శాతానికి పెరిగినట్లు ఎస్‌బీఐ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.
ఈ ఏడాది మేలో రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది ఆర్బీఐ. ఆ సమయంలో ఎస్బీఐ కూడా అకస్మాత్తుగా రెపో రేటును పెంచింది. దీని తరువాత జూన్, ఆగస్టు, సెప్టెంబర్లలో రెపో రేటును 50-50 బేసిస్ పాయింట్లు పెంచారు. ఇప్పటివరకు 2.25% పెరిగింది. దీంతో లోన్లు తీసుకున్న ఖాతాదారులు మరింత అధికంగా వడ్డీ రేట్లు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంసీఎల్‌ఆర్ అంటే..
కస్టమర్లు తీసుకునే లోన్లపై బ్యాంకులు వసూలు చేసే కనీస వడ్డీరేటును ఎంసీఎల్‌ఆర్ అంటారు. కస్టమర్లు తీసుకున్న లోన్‌పై వడ్డీరేటు పెరిగేతే.. ఎంసీఎల్‌ఆర్ ఆటోమేటిక్‌గా లోన్ కాస్ట్‌పై ప్రభావం చూపుతుంది. ఖాతాదారులు తీసుకున్న లోన్లపై వడ్డీ రేటు పెరిగితే.. చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం కూడా పెరుగుతుంది. ఎంసీఎల్‌ఆర్ లింక్‌తో లోన్లు తీసుకున్న ఖాతాదారులు.. అధిక వడ్డీతో ఈఎంఐలు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ బహుమతి.. 18 నెలల డీఏ పెండింగ్ కేంద్ర నిర్ణయం..?
Also Read: SBI Credit Card New Rules: 2023 జనవరి నుండి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కొత్త రూల్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook