7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ బహుమతి.. 18 నెలల డీఏ పెండింగ్ కేంద్ర నిర్ణయం..?

7th Pay Commission Da Hike: పెండింగ్‌లో ఉన్న 18 నెలల డీఏ బకాయిల కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కొత్త ఏడాదిలో అయినా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని గట్టి నమ్మకంతో ఉన్నారు..? మరి ఉద్యోగుల కోరికను ప్రభుత్వం నెరవేరుస్తుందా..? ఎలా నిర్ణయం తీసుకోనుంది..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 05:32 PM IST
7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ బహుమతి.. 18 నెలల డీఏ పెండింగ్ కేంద్ర నిర్ణయం..?

7th Pay Commission Da Hike: కొత్త సంవత్సరంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త రానుంది. 18 నెలల బకాయి డియర్‌నెస్ అలవెన్స్‌ (డీఏ) కోసం కేంద్ర ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు బంపర్ బహుమతి వస్తుందని ప్రచారం జరుగుతోంది. 

కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం 18 నెలల డీఏ బకాయిలను పెండింగ్‌లో ఉంచింది. అప్పటి నుంచి ఉద్యోగులు పెండింగ్ డీఏ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంఘం ప్రతినిధులు క్యాబినెట్ సెక్రటరీని కూడా కలిశారు. అయితే మొండి బకాయిలపై చర్చలు ఎంత వరకు సాగాయన్న సమాచారం బయటకు రాలేదు. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో పలు అంశాలపై ఏకాభిప్రాయం రావచ్చని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్, బకాయిలపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా నెలల తరబడి కొనసాగుతున్న ఉద్యోగుల సంఘాల డిమాండ్‌పై కూడా ప్రభుత్వం సానుకూలంగా చర్యలు తీసుకోవచ్చు. ఇది కాకుండా జనవరి 2023 నాటి డీఏ కూడా 3 నుండి 4 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో 13వ విడత పీఎం కిసాన్‌ను రైతుల ఖాతాకు బదిలీ చేయడంపై కూడా చర్చ జరగనుంది. గతంలో 18 నెలల డీఏ బకాయిలకు ప్రభుత్వం నిరాకరించింది. అయితే చర్చల అనంతరం దీనికి సంబంధించి ఏకాభిప్రాయానికి రావచ్చని సమాచారం.

కోవిడ్-19 మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జనవరి 2020 నుంచి జూన్ 2021 వరకు డీఏ అందజేయలేదు. ఈ ఏడాదిన్నర కాలంలో ప్రభుత్వం డీఏను 11 శాతం పెంచింది. దాని చెల్లింపు స్తంభింపజేసినప్పటికీ ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వం నిలుపుదల చేయరాదని కోర్టు కూడా అంగీకరించిందని ఉద్యోగులు తెలిపారు. బకాయిల డిమాండ్‌పై ఉద్యోగులు కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఈ విషయమై పింఛనుదారులు ప్రధాని మోదీకి కూడా విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఉద్యోగుల డీఏ బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తే.. వారి ఖాతాలోకి భారీగానే చేరే అవకాశం ఉంది. లెవెల్-3లో ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య ఉండవచ్చని అంచనా. అదేవిధంగా లెవల్-13 లేదా లెవల్-14 ఉద్యోగుల డీఏ బకాయిలు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 వరకు ఉండవచ్చు. డీఏ బకాయిలను ఒకేసారి ఇవ్వకుండా మూడు విడతలుగా ఇవ్వవచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. 

Also Read: Viral Video: ట్రైన్ ఫుల్‌గా ఉందని డ్రైవర్ సీట్లో కూర్చున్న మహిళ.. వీడియో వైరల్  

Also Read: MLC Kavitha: ఆ మాటలు నన్ను బాధించాయి.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్సీ కవిత  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News