SBI RD Interest Rates: ఎస్‌బీఐ ఆర్‌డీలో రూ.5 వేలు పెడితే.. రూ.55 వేలు లాభం.. ఎలాగంటే..?
State Bank Of India Latest Schemes: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐ.. కస్టమర్లకు ఆకట్టుకునేందుకు మంచి వడ్డీ రేట్లతో స్కీమ్‌లను తీసుకువస్తోంది. వాటిలో రింకరింగ్ డిపాజిట్ స్కీమ్ ఒకటి. ఇందులో రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే.. రూ.55 వేలు లాభం పొందవచ్చు. ఎలాగంటే..
State Bank Of India Latest Schemes: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారుల కోసం ప్రత్యేక స్కీమ్‌లను తీసుకువస్తోంది. ఆకర్షణీయమైన వడ్డీ రేట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా మరో ఆఫర్‌ను తీసుకువచ్చింది. ఇందులో మీరు రూ.5 వేలు పెట్టుబడి పెడితే.. బ్యాంక్ నుంచి వడ్డీగా రూ.55 వేలు పొందుతారు. ఎస్‌బీఐ స్కీమ్ కాబట్టి.. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు సురక్షింతంగా ఉంటుంది. రింకరింగ్ డిపాజిట్ ద్వారా ఎస్‌బీఐ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. దీని కింద 6.8 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు మరికాస్త ఎక్కువ ఇస్తోంది. వాళ్లకు 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.
గరిష్టంగా 10 ఏళ్లపాటు ఆర్‌డీని పొందే అవకాశాన్ని ఎస్‌బీఐ బ్యాంక్ అందిస్తోంది. వివిధ పదవీ కాలల కోసం మీరు ఆర్‌డీలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ పథకంలో మీరు 100 రూపాయలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు. అయితే ప్రతి నెలా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు కూడా ఆర్‌డీ చేయవచ్చు.
మీకు రూ.55 వేల వడ్డీ కావాలంటే.. మీరు ప్రతి నెలా రూ.5 వేలు ఆర్డీ చేయాలి. ఐదేళ్ల కాలానికి ఆర్‌డీ పూర్తి చేస్తే.. బ్యాంకు నుంచి 6.5 శాతం వడ్డీ ప్రయోజనం పొందుతారు. ప్రతి సంవత్సరం కలిపిన మొత్తంపై వడ్డీ కూడా పెరుగుతుంది. ఐదేళ్ల తరువాత రూ.54,957 వడ్డీని పొందుతారు.
ఏ కాలంలో ఎంత వడ్డీ అంటే..?
==> సాధారణ కస్టమర్లు ఒకటి నుంచి రెండేళ్ల కంటే తక్కువ ఆర్‌డీపై 6.80 శాతం వడ్డీని పొందుతారు. సీనియర్ సిటిజన్లకు 7.30 శాతం వడ్డీ లభిస్తుంది.
==> రెండేళ్ల కంటే ఎక్కువ.. మూడేళ్ల కంటే తక్కువ ఉన్న ఆర్‌డీపై సాధారణ వినియోగదారులకు 7 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
==> మూడేళ్ల కంటే ఎక్కువ.. 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న ఆర్‌డీపై సాధారణ కస్టమర్లకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ లభిస్తుంది.
==> ఐదేళ్ల నుంచి 10 సంవత్సరాల మధ్య ఆర్‌డీపై సాధారణ వినియోగదారులకు 6.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.
Also Read: Chandrababu Case Updates: అది నా నిర్ణయంకాదు, ప్రభుత్వ నిర్ణయం, కోర్టులో చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook