SBI Big Alert: ఏప్రిల్ 1 నుంచి భారీగా పెరగనున్న డెబిట్ కార్డుల ఛార్జీలు
SBI Big Alert: దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ఎస్బీఐ డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీల్లో మార్పులు చేసింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
SBI Big Alert: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ముఖ్య గమనిక. ఎస్బీఐలో కొత్త మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. డెబిట్ కార్డుల వార్షిక నిర్వహణ ఛార్జీలను ఎస్బీఐ పెంచింది. డెబిట్ కార్డు మెయింటెనెన్స్ ఛార్జీలు ఏ మేరకు పెరిగాయో తెలుసుకుందాం. పెరిగిన మెయింటెనెన్స్‌పై 18 శాతం జీఎస్టీ కూడా వర్తించనుంది.
ఎస్బీఐ క్లాసిక్ డెబిట్ కార్డుతో పాటు సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ కార్డులపై మెయింటెనెన్స్ ఛార్జీని 125 ప్లస్ జీఎస్టీ నుంచి 200 ప్లస్ జీఎస్టీకు పెంచింది. ఇక ఎస్బీఐ యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డ్, మై కార్డ్ నిర్వహణ ఛార్జీలను 175 ప్లస్ జీఎస్టీ నుంచి 250 ప్లస్ జీఎస్టీకు పెంచింది. ఇక ఎస్బీఐ ప్లాటినం బిజినెస్ డెబిట్ కార్డుపై మెయింటెనెన్స్ ఛార్జీని 350 ప్లస్ జీఎస్టీ నుంచి 425 ప్లస్ జీఎస్టీకు పెంచింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుల్లో కూడా కొన్ని మార్పులు చేసింది. ఏప్రిల్ 1 నుంచి రెంటల్ చెల్లింపులపై ఇచ్చే రివార్డ్ పాయింట్ల విధానాన్ని ఎస్బీఐ రద్దు చేసింది. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్ కార్డులపై రివార్డు పాయింట్ల విధానం ఏప్రిల్ 15 వరకే అందుబాటులో ఉంటుంది. ఎస్బీఐతో పాటు ప్రముఖ అంతర్జాతీయ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ కూడా నిబంధనల్లో మార్పులు చేసింది. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ తొలగించింది. బుక్ మై షో వంటి వాటిపై లభించే ఆఫర్లు, రివార్డు పాయింట్ల విధానంలో మార్పులు చేసింది.
Also read: Personal Loan Rules: పర్సనల్ లోన్ మంజూరయ్యేందుకు ఎంత సమయం పడుతుంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook