SBI Scheme: ఎస్‌బీఐ ఎఫ్‌డీ కొత్త స్కీమ్.. రూ.10 లక్షలకు మెచ్యూరిటీ ఎంతంటే!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీనియర్ సిటిజన్ ల కోసం కొత్తగా స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ను తీసుకొచ్చింది. ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత మొత్తం పొందవచ్చో ఇక్కడ పూర్తీ వివరాలు తెలుపబడ్డాయి.
SBI Scheme: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్‌డీ లపై కొత్త స్కీమ్ తీసుకు వచ్చింది. స్పెషల్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ గడువును జూన్ 30వ తారీకు వరకు పెంచడం జరిగింది. వీకేర్ లో భాగంగా సీనియర్ సిటిజన్స్ టర్మ్ డిపాజిట్ ప్రోగ్రామ్ ను 2020 లో ప్రారంభించిన విషయం తెల్సిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు పొడగిస్తూనే ఉన్నారు.
తాజాగా జూన్ 30 వరకు పొడగించడంతో ఎంతో మంది సీనియర్ సిటిజన్స్ కు ఉపయోగదాయకం. ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ కు ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసే బ్యాంక్ ల్లో ఎస్‌బీఐ ముందు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఎక్కువ కాలం టర్మ్ డిపాజిట్ తో పెట్టిన మొత్తంకు డబుల్ రాబడి వస్తుందని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు.
సీనియర్ సిటిజన్లు తక్కువలో తక్కువ 7 రోజుల నుండి గరిష్టంగా 10 సంవత్సరాల టెన్యూర్ ఎఫ్‌డీ స్కీమ్ లో డిపాజిట్ చేయవచ్చు. సాధారణ కస్టమర్లతో పోల్చితే సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. గరిష్టంగా 0.50 శాతం వడ్డీ రేటు ఎక్కువగా ఇస్తున్నట్లుగా ఎస్‌బీఐ పేర్కొంది.
ఇప్పటికే ఇస్తున్న 0.50 శాతం వడ్డీ రేటుతో పాటు వీ కేర్ స్కీమ్ లో మరో 0.50 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. అంటే మొత్తంగా సాధారణ కస్టమర్ల కంటే సీనియర్ సిటిజన్స్ కు 1 శాతం వడ్డీ రేటు అధికంగా ఇస్తున్నారు. వీకేర్ ఎఫ్‌డీ స్కీమ్ లో 5 ఏళ్ల నుండి 10 ఏళ్ల టెన్యూర్ ఉంది. రెగ్యులర్ కస్టమర్లకు 6.5 శాతం వడ్డీ రేటు ఉండగా సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటు ఉంది.
ఉదాహరణకు సీనియర్ సిటిజన్లు ఎస్‌బీఐ లో వీ కేర్ స్కీమ్ లో భాగంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ గా 10 ఏళ్ల టెన్యూర్ కి గాను రూ.10 లక్షల ను డిపాజిట్ చేయగా.. ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. దాంతో 10 ఏళ్లకు మెచ్యూరిటీ నాటికి 21,02,349 రూపాయలు చేతికి వస్తాయి. అంటే పదేళ్లలో డబ్బు డబుల్ అవుతోంది. ఈ స్కీమ్ లో డబ్బును ఒక్కసారి ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే మధ్యలో తీసుకోవడానికి లేదు. ఆ మొత్తం మెచ్యూరిటీ అయ్యే వరకు తీసుకునే అవకాశం లేదు. కనుక సీనియర్ సిటిజన్స్ కి ఈ స్కీమ్ అద్భుతంగా ఉంటుందని ఎస్‌బీఐ అధికారులు చెబుతున్నారు.
Also Read: Revanth Reddy: ఓఆర్ఆర్‌ను తెగనమ్మేశారు.. ఎవరినీ వదిలే ప్రసక్తి లేదు: రేవంత్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.