Actress Rashmika Mandhana reveales her Favourite Cricketer and IPL Team: 1996 ఏప్రిల్ 5న కర్ణాటకలోని విరజ్‌పేట్‌లో జన్మించిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'కిరిక్ పార్టి' అనే కన్నడ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన రష్మిక.. 'ఛలో' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమానే హిట్ కావడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారు. ఛలో, గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేశారు. రష్మిక చేతిలో ప్రస్తుతం 3-4 సినిమాలు ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున హీరోగా తెరకెక్కుతున్న పుష్ప-2లో రష్మిక మందన్న నటిస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చేయనుందట. ఈ సాంగ్ చేయడానికి దాదాపుగా ఐదు కోట్ల వరకు డిమాండ్ చేశారట. అయినా కూడా శ్రీవల్లి క్రేజ్ దృష్ట్యా ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు సమాచారం. ఇక రష్మిక ఓవైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే.. మరోవైపు ఐపీఎల్ 2023 మ్యాచులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా రష్మికతో ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ 'స్టార్ స్పోర్ట్స్' చిట్ చాట్ చేసింది. నేడు మ్యాచ్ సమయంలో ఆ వీడియోను ప్లే చేసే అవకాశం ఉంది.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు చాలా ఇష్టమని రష్మిక మందన్న తెలిపారు. కోహ్లీ దూకుడు, బ్యాటింగ్ శైలి తనకు బాగా నచ్చుతాయని తెలిపారు. ఓ బెంగళూరు అమ్మాయిగా తాను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టునే అభిమానిస్తానని పేర్కొన్నారు. 'నేను కర్ణాటక అమ్మాయిని. మాకు 'ఈసా కప్ నమ్దే' అనే స్లోగన్ ఉంది. దాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఐపీఎల్ 2023లో బెంగళూరు ఫైనల్ వెళ్తుందని భావిస్తున్నా. విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. అతడి దూకుడు, బ్యాటింగ్ నాకు చాలా బాగా నచ్చుతాయి' అని స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న చెప్పుకొచ్చారు. ఈ వీడీయో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంది.
Rashmika Mandanna talking about her favourite IPL cricketer Virat Kohli and her favourite IPL team RCB. pic.twitter.com/Q7fG6tL3N2
— CricketMAN2 (@ImTanujSingh) May 1, 2023
ఐపీఎల్ 2023 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఐపీఎల్ 2023 పాయింట్ల పట్టికలో బెంగళూరు ఆరో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 4 విజయాలతో 8 పాయింట్స్ ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నేడు జరగనున్న మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో అనూహ్యంగా ఓడిన ఆర్‌సీబీ.. మళ్లీ విజయాల బాట పట్టాలని చూస్తోంది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ గాయం బెంగళూరు జట్టుకి ప్రతికూలంగా మారింది.
Also Read: Virat Kohli-Anushka Sharma: నిన్ను పిచ్చిగా ప్రేమిస్తూనే ఉంటా.. విరాట్ కోహ్లీ ట్వీట్ వైరల్!
Also Read: Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్థాన్ ఔట్.. ఐదు దేశాలతో టోర్నీ ప్లాన్ చేసిన బీసీసీఐ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.