5 Stocks : స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి.నేడు సోమవారం ఆగస్టు 5వ తేదీ ట్రేడింగ్ భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్ 2,222 పాయింట్లు నష్టపోగా..నిఫ్టి 600పాయింట్లు పైగా నష్టపోయింది. ఈ రెండూ సూచీలు దాదాపు రెండు శాతం చొప్పున నష్టపోయాయి. స్టాక్ మార్కెట్లను దెబ్బతీసిన స్టాక్స్ లో ప్రధానంగా అన్ని సెక్టార్ల సూచీలు ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 3శాతం  నష్టపోయింది. అదే సమయంలో మెటల్స్, ఆటోమొబైల్స్, ఐటీ, ఫార్మా  సెక్టార్లు 2 నుంచి 4శాతం చొప్పున నష్టపోయాయి. ఇండెక్స్ లో హేవీ వెయిట్ స్టాక్స్ గా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీ, టీసీఎస్, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ , టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ వంటి షేర్లు 2 నుంచి 7శాతం వరకు నష్టపోయాయి. ఈనేపథ్యంలో మార్కెట్లు భారీగా పతనం అవుతున్నప్పటికీ టెక్నీకల్ గాను, ఫండమెంటల్ గాను బలంగా స్టాక్స్ వైపు చూడాలని ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకోసం 5 స్టాక్స్ రెకమండ్ చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఏషియన్ పేయింట్స్, టార్గెట్: 3450, స్టాప్ లాస్ : 3000


దేశంలో ప్రముఖ పేయింట్ సంస్థ అయిన ఏషియన్ పేయింట్స్ షేర్లను కొనుగోలు చేయమని ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సి.మెహత ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. ఈ స్టాక్ టార్గెట్ ధర 3450, స్టాప్ లాస్ 3000గా నిర్ణయించారు. 


Also Read : Best Investment Plan: ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే సీనియర్ సిటిజన్లు నెలకు 50 వేల నుంచి 1 లక్ష రూపాయలు పొందవచ్చు


అపోలో హాస్పిటల్స్, టార్గెట్ 7200 స్టాప్ లాస్ 6450


దేశంలో అతిపెద్ద ఆసుపత్రి చైన్ అయిన అపోలో హాస్పిటల్స్ ఫండమెంటర్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ..బలమైన రాబడిని సూచిస్తుంది. ఈ నేపథ్యలో ఈ స్టాక్స్ కొనుగోలు చేయమని  ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. ఈ స్టాక్ ధర 7200కాగా స్టాప్ లాస్ 6450గా నిర్ణయించారు. 


BPCL, టార్గెట్: 380, స్టాప్ లాస్: 318


కేంద్ర ప్రభుత్వ చమురు రంగ సంస్థ అయిన బీపీసీఎల్ ఫండమెంటల్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ స్ట్రాంగ్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్స్ కొనుగోలు చేయమని  ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకు రెకమండ్ చేస్తున్నారు. ఈ స్టార్ ధర 380కాగా స్టాప్ లాస్ 318గా నిర్ణయించారు. 


IEX, టార్గెట్ : 210  స్టాప్ లాస్ : 180


ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లిమిటెడ్..ఫండమెంటల్ పరంగానూ, టెక్నికల్ పరంగానూ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టాక్స్ కొనుగోలు చేయమని  ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకు రెకమండ్ చేస్తున్నారు.ఈ స్టాక్ ధర 210కాగా..స్టాప్ లాస్ 180 గా నిర్ణయించారు. 


టాటా కన్స్యూమర్ టార్గెట్  1295, స్టాప్ లాస్ 1150 


ప్రముఖ ఎస్ఎమ్ సీజీ కంపెనీ అయిన టాటా కన్య్సూమర్స్ లిమిటెడ్ ..టెక్నికల్ పరంగా, ఫండమెంటల్ పరంగా బలంగా ఉండటంతో బయ్యింగ్ ఇంట్రెస్ట్ చూపించమని ప్రముఖ ఇన్వెస్టర్ రోహణ్ షా, సిద్దార్థ్ భామ్రే ఇన్వెస్టర్లకు రెకమండ్ చేస్తున్నారు.ఈ స్టాక్ ధర  1295 ఉంటే..స్టాప్ లాస్ 1150 గా నిర్ణయించారు. 


Disclaimer: ఈక్విటీ మార్కెట్లలో  పెట్టుబడులు రిస్కుతో కూడుకున్నవి. ఈ కథనంలో ఇక్కడ వ్యక్తీకరించిన అభిప్రాయాలు/సూచనలు/సలహాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు ఎలాంటి షేర్ మార్కెట్ రికమండేషన్స్ ఇవ్వదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు నిపుణులైన సర్టిఫైడ్ ఇన్వెస్ట్ మెంట్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించాలని జీ తెలుగు పాఠకులను సూచిస్తుంది.


Also Read : Stock market crashes:స్టాక్ మార్కెట్లలో రక్త పాతం...రూ. 10 లక్షల కోట్ల సొమ్ము ఆవిరి..కారణాలు ఇవే..!!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook