Best 7 Seater Cars: 10 లక్షల బడ్జెట్లో టాప్ 5 బెస్ట్ 7 సీటర్ కార్లు ఇవే

Best 7 Seater Cars Under 10 Lakhs Budget: ఇండియాలో గత కొద్దికాలంగా 7 సీటర్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దూర ప్రయాణాలు చేసేందుకు అనువుగా ఉండటంతో పాటు ఎక్కువమంది ప్రయాణించవచ్చు. అందుకే 7 సీటర్ బెస్ట్ ఆప్షన్ అవుతోంది. ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 

Best 7 Seater Cars Under 10 Lakhs Budget: అయితే 7 సీటర్ అనగానే బడ్జెట్ ఎక్కువనే సందేహాలు వస్తుంటాయి. కానీ 10 లక్షల బడ్జెట్లో కూడా అనువైన బెస్ట్ 7 సీటర్ కార్లు అందుబాటులో ఉన్నాయి. 10 లక్షలకే లభించే 5 బెస్ట్ 7 సీటర్ కార్ల గురించి తెలుసుకుందాం.

1 /5

రెనాల్ట్ ట్రైబర్ రెనాల్ట్ ట్రైబర్ 7 సీటర్ సెగ్మెంట్ లో బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే 7 సీటర్ విభాగంలో ఇంతకంటే తక్కువ ధర మరొకటి లేదు. మాడ్యులర్ సీటింగ్ , స్మార్ట్ ఇంటీరియర్స్ ఈ కారును ప్రత్యేకంగా నిలుపుతుంది. ఇందుోల 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు ధర 5.5 లక్షల నుంచి ప్రారంభమౌతుంది. ఈ కారు మైలేజ్ కూడా బాగుంటుంది.

2 /5

మహీంద్రా బొలేరో మహీంద్రా బొలేరో స్ట్రాంగ్  రఫ్ అండ్ టఫ్ కారుగా ప్రసిద్ధికెక్కింది. అంటే బయట రోడ్లు ఎలా ఉన్నా ఈ కారు తట్టుకోగలదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఉంది. మైలేజ్ కూడా బాగుంటుంది. బొలేరో ప్రారంభ ధర 9 లక్షల రూపాయలు. 

3 /5

మారుతి సుజుకి ఎర్టిగా మారుతి సుజుకి ఎర్టిగా దేశంలో అత్యంత నమ్మకమైన బ్రాండ్. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కూడా బాగుంటుంది. ఇందులో పెట్రోల్, సీఎన్డీ రెండు వేరియంట్లు ఉన్నాయి. ఎర్టిగాలో స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఏబీఎస్ టెక్నాలజీ, ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో బెస్ట్ కారు ఇది. ఈ కారు ధర 8 లక్షల నుంచి 10 లక్షల వరకు ఉంది.

4 /5

మారుతి ఈకో మారుతి సుజుకి నుంచి ఈకో కారు బడ్జెట్ ఫ్రెండ్లీ 7 సీటర్ కారు. ఈ కారు ఎక్కువగా ట్రాన్స్‌పోర్ట్ కోసం వినియోగిస్తుంటారు. ఈ కారు ధర 5.32 లక్షల నుంచి 6.58 లక్షల మధ్యలో ఉంటుంది. మైలేజ్ కూడా బాగుంటుంది

5 /5

మహీంద్రా బొలేరో నియో మహీంద్రా బొలేరో నియో 7 సీటర్ కారు. ఈ కారు ధర 9.95 లక్షల నుంచి 12.15 లక్షల వరకు ఉంటుంది. స్ట్రాంగ్ నెస్, నమ్మకం ఈ కారు ప్రత్యేకతలు