Stock Market Tips: షేర్ మార్కెట్ ప్రపంచంలో రాకేశ్ ఝున్ ఝున్ వాలా గురించి తెలియనివాళ్లుండరు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులతో భారీ లాభాలు ఆర్జించిన ఆయన కొత్తగా ఇన్వెస్ట్ చేసేవారికి ఎప్పుడూ కీలకమైన టిప్స్ అందించారు. సహనం, నిశిత పరిశీలన, అధ్యయనం, రిస్క్ లేకుండా స్టాక్ మార్కెట్‌లో మనుగడ కష్టమంటున్నారు. స్టాక్ మార్కెట్‌లో లాభాల సంపాదించేందుకు ఆయన చెప్పిన టాప్ 5 టిప్స్ గురించి తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

స్టాక్ మార్కెట్‌లో రాణించాలంటే ముఖ్యంగా కావల్సింది సహనం, నిశిత పరిశీలన, నిరంతర అధ్యయనం, రిస్క్. ఇవి ఉంటే ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో లాభాలు ఆర్జించవచ్చు. ఈ విషయాలు మేము చెప్పడం లేదు. బిగ్‌బుల్ రాకేశ్ ఝున్ ఝున్ వాలా చెప్పే టిప్స్ లేదా సూచనలు. ఆయన చెప్పిన 5 టిప్స్‌లో మొదటిది పెట్టుబడులు దీర్ఘకాలంగా ఉండాలనేది. ఆయన అదే విధంగా ఇన్వెస్ట్ చేసి లాభాలు ఆర్జించారు. దీనికి ఉదాహరణ టైటాన్ షేర్. 2002-03లో టైటాన్ షేర్ కొనడం ప్రారంభించినప్పుడు షేర్ ధర కేవలం 3-4 రూపాయలు మాత్రమే. ఇప్పుడు అదే షేర్ విలవ 3,400 రూపాయలుంది. 2008లో ఆర్ధిక మాంద్యం తలెత్తినా టైటాన్ షేర్లను అమ్మలేదు. మరో నాలుగేళ్లకు అంటే 2012లో 10.28 శాతం షేర్ పెంచుకున్నారు. 


సమగ్ర పరిశీలన, అధ్యయనం ఉండాలంటారు. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టేముందు అధ్యయనం లోతుగా ఉండాలి. దీనిక ఉదాహరణ లూపిన్ కంపెనీ. 2003లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించిన ఆయన వాటా 2008 నాటికి 4.29 శాతానికి తగ్గింది. అప్పట్నించి క్రమంగా లూపిన్‌లో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ వచ్చి షేర్ విలువ 1100 రూపాయలకు చేరగానే మొత్తం షేర్లు అమ్మేశారు. లూపిన్ కంపెనీపై ఆయన చేసిన సమగ్ర అధ్యయనమే ఇందుకు కారణం. ఇక మూడవ టిప్ సహనం, నమ్మకం కలిగి ఉండటం. 2008లో మార్కెట్ మాంద్యం సమయంలో కూడా క్రిసిల్ షేర్లను అలానే ఉంచుకున్నారు. 400-500 రూపాయలకు కొన్న ఆ షేర్ల విలువ ఇప్పుడు 1322 కోట్లుగా ఉంది. 


గ్రోత్ పొటెన్షియాలిటీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక కంపెనీ స్టాక్ కొనే ముందు ఆ కంపెనీ అభివృద్ధికి ఉన్న సాధ్యాసాధ్యాలు అంచనా వేయగలగాలి. సదరు కంపెనీ అందించే ఉత్పత్తులకు భవిష్యత్తులో ఏర్పడే డిమాండ్ అంచనా వేయాలి. అప్పుడే ఎలాంటి స్టాక్ కొంటే దీర్ఘకాలంలో లాభాలు ఆర్జించగలమో తెలుస్తుంది. ఇక చివరిది అతి ముఖ్యమైంది రిస్క్. రిస్క్ అనేది కచ్చితత్వంతో లెక్కగట్టి తీసుకోవాలి. అంటే రిస్క్ తీసుకున్నా అందులో కూడా లాభాన్ని చూడగలగాలి. వైశ్రాయ్ హోటల్ షేర్లను 2015లో కొనడమే దీనికి ఉదాహరణ. 2018 నాటికి ఇందులో వాటాను 1 శాతం కంటే తక్కువకు కుదించేశారు. ఆ తరువాతే కంపెనీపై నిఘా, ఇతర చర్యలు చోటుచేసుకున్నాయి. 


ఇప్పుుడు మీలో ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ఈ ఐదు అంశాలు పాటించాలి. అప్పుడే లాభాలు ఆర్జించేందుకు వీలుంటుంది. 


Also read: 8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్, 8వ వేతన సంఘంపై ప్రకటన, డీఏ పెంపు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.