8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్, 8వ వేతన సంఘంపై ప్రకటన, డీఏ పెంపు

8th Pay Commission Big News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ న్యూస్. మరి కొద్దిరోజుల్లో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 8వ వేతన సంఘం ఏర్పాటు, డీఏ పెంపు, జీత భత్యాలకు సంబంధించి ఈ బడ్జెట్‌లో కీలకమైన అప్‌డేట్ వెలువడవచ్చు.

8th Pay Commission Big News: 7వ వేతన సంఘం ప్రకారం జనవరి 2025లో డీఏ మరో 3 శాతం పెరిగి 56 శాతానికి చేరుకోవచ్చు.  ఫలితంగా నెలకు 18 వేల కనీస వేతనం ఉన్నవారికి 540 రూపాయలు, గరిష్ట జీతం 2,50 లక్షలున్నవారికి  7,500 రూపాయలు పెరగనుంది. అటు పెన్షనర్లకు కూడా భారీగా పెన్షన్ పెరగనుంది. ఈ అంశంపై మరి కొద్దిరోజుల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గుడ్‌న్యూస్ వినవచ్చు.
 

1 /9

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు కనీస వేతనం 9000 ఉంటే పెన్షన్ 270 రూపాయలు, 1,25,000 పెన్షన్ ఉంటే 3,750 రూపాయలు పెన్షన్ పెరుగుతుంది. 

2 /9

జనవరి 2025 డీఏ పెంపు 3 శాతం ఉంటే మొత్తం డీఏ 56 శాతానికి చేరుతుంది. కనీస వేతనం 18 వేలుంటే నెలకు 540రూపాయలు పెరగనుంది. గరిష్ట జీతం 2.50 లక్షలుంటే 7,500 జీతం పెరుగుతుంది. 

3 /9

ఇక కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడవ గుడ్‌న్యూస్ జనవరి 2025 డీఏ ప్రకటన. ఏఐసీపీఐ ఇండెక్స్ ప్రకారం ఈసారి కూడా డీఏ 3 శాతం పెరగవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే మొత్తం డీఏ 56 శాతం పెరగవచ్చు. 

4 /9

ఇక లెవెల్ 14 ఉద్యోగులకు కనిష్టంగా 1,82,200 రూపాయల నుంచి గరిష్టంగా 2,24,100 రూపాయల వరకూ లభిస్తాయి. 

5 /9

డీఏ బకాయిల ద్వారా ఎంత లభిస్తుందనేది ఉద్యోగుల జీతం, గ్రేడ్ పే ఆధారంగా ఉంటుంది. లెవెల్ 1 ఉద్యోగులకు 11,800 రూపాయల నుంచి గరిష్టంగా 37,554 రూపాయలు పొందవచ్చు.లెవెల్ 13 ఉద్యోగులకు 1,44,200 రూపాయల నుంచి 2,18,200 వరకూ లభిస్తుంది

6 /9

రెండవ గుడ్‌న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పట్నించో ఎదురుచూస్తున్న 18 నెలల పెండింగ్ డీఏ. కరోనా మహమ్మారి సమయంలో 18 నెలల డీఏ నిలిచిపోయింది. ఈ పెండింగ్ డీఏపై కేంద్ర బడ్జెట్‌లో ప్రకటన ఉండవచ్చని అంచనా.

7 /9

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు బక్రియోట్ ఫార్ములా ఉపయోగించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఈ విధానంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షనర్ల పెన్షన్ భారీగా పెరగవచ్చు.

8 /9

ప్రైవేట్ ఉద్యోగులకు ప్రతి యేటా అప్రైజల్ విధానం అంటే పనితీరుని బట్టి వేతనం పెంపు ఉంటుంది. అదే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సైతం అమలు చేయవచ్చని భావిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లోనే దీనిపై స్పష్టత రానుంది. 

9 /9

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు గత కొద్దికాలంగా 8వ వేతన సంఘం కోసం ఎదురుచూస్తున్నారు. వేతన సంఘాన్ని తొలగించి అప్రైజర్ విధానం ప్రవేశపెట్టవచ్చనే వార్తలు కూడా వస్తున్నాయి.