Stock Markets: మార్కెట్లకు రెండో రోజూ నష్టాలు- కుదిపేసిన ఐటీ, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు
Stock Markets: షేర్ మార్కెట్లు బుధవారం మరోసారి నష్టాలతో ముగిశాయి. ఐటీ, హెచ్డీఎఫ్సీ జంట షేర్ల పతనంతో సూచీలు భారీగా నష్టపోయాయి. మార్కెట్లు నష్టాలతో ముగియటం ఇది వరుసగా రెండో సెషన్.
Stock Markets: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతో ముగిశాయి. ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. దీనితో రెండో రోజూ నష్టాలు తప్పలేదు.
బుధవారం సెషన్లో బీఎస్ఈ-సెన్సెక్స్ 566 పాయింట్లు కోల్పోయింది. దీనితో 59,610 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 17,798 వద్దకు దిగొచ్చింది.
విలీన ప్రకటన తర్వాత హెచ్డీఎఫ్సీ జంట షేర్లలో రెండో రోజూ భారీగా లాభాల స్వీకరణ నమోదైంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. 30 షేర్ల ఇండెక్స్‌లో ఈ రెండు సంస్థలే అత్యధిక నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ ప్రతికూల పవనాలు కూడా మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
ఐటీ, బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. లోహ ఎఫ్ఎంసీజీ షేర్లు కాస్త సానుకూలంగా స్పందించాయి.
సూచీల కదలికలు ఇలా..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 59,941 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 59,509 కనిష్ఠానికీ పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 17,901 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 17,779 స్థాయిని కూడా చేరింది.
నేటి సెషన్లో టాప్-5 షేర్లు..
ఎన్టీపీసీ 2.61 శాతం, టాటా స్టీల్ 1.94 శాతం, పవర్‌గ్రిడ్ 1.52 శాతం, నెస్లే ఇండియా 1.10 శాతం లాభాలను గడించాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 3.51 శాతం, హెచ్డీఎఫ్సీ 3.26 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.07 శాతం, టెక్ మహీంద్రా 1.67 శాతం నష్టాలతో సెషన్‌ను ముగించాయి.
Also read: Zomato outage: నిలిచిన జొమాటో, స్విగ్గీ సేవలు.. బుకింగ్స్ కోసం కస్టమర్ల తిప్పలు
Also read: HDFC merge: హెచ్డీఎఫ్సీ బ్యాంక్-హెచ్డీఎఫ్సీ విలీనంతో వచ్చే భారీ మార్పులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook