Stock Market today: వారాంతపు సెషన్లో ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market today: స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు బ్రేక్ పడింది. వారాంతపు సెషన్లో (stocks closing bell) అతి స్వల్ప నష్టాలతో ముగిశాయి.
Stock Market today: స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు వారాంతంలో అడ్డుకట్ట పడింది. నేటి సెషన్లో (శుక్రవారం) సూచీలు ఫ్లాట్‌గా (stocks closing bell) ముగిశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్ (BSE Sensex) 12 పాయింట్లు తగ్గి 61,233 వద్దకు చేరింది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 2 పాయింట్ల అతి స్వల్ప నష్టంతో 18,255 వద్ద స్థిరపడింది.
ఇటీవలి వరుస లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఫలితంగా సూచీలు నేటి ఇంట్రాడేలో భారీ నష్టాలను నమోదు చేశాయి. అయితే ఐటీ షేర్ల అండతో చివరకు ఫ్లాట్‌గా స్థిరపడ్డాయి.
ఈ రోజు సెషన్ ఎలా సాగిందంటే..
ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్ 61,324 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో 60,757 కనిష్ఠానికి పడిపోయింది.
నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,286 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 18,119 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.
లాభ నష్టాల్లో టాప్-5 షేర్లు..
బీఎస్ఈ 30 షేర్ల ఇండెక్స్‌లో 13 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 17 కంపెనీలు డీలా పడ్డాయి.
టీసీఎస్ 1.84 శాతం, ఇన్ఫోసిస్ 1.64 శాతం, ఎల్&టీ 1.32 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 1.11 శాతం, టెక్ మహీంద్రా 0.88 శాతం లాభాలను గడించాయి.
ఏషియన్ పెయింట్స్ 2.65 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.62 శాతం, హెచ్‌యూఎల్ 2.13 శాతం, విప్రో 1.55 శాతం, ఎం&ఎం 1.53 శాతం నష్టపోయాయి.
ఆసియాలో ఇతర మార్కెట్లు..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), టోక్యో (జపాన్), సియోల్ (దక్షిణ కొరియా), థైవాన్, హాంగ్ సెంగ్ (హాంకాంగ్) సూచీలు నష్టపోయాయి.
రూపాయి విలువ..
డాలర్‌తో పోలిస్తే రూపాయి 28 పైసలు క్షీణించింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.16 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.
Also read: Gold Price Today : దేశీయ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు.. పూర్తి వివరాలివే...
Also read: Whatsapp Voice Message: వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ వింటూనే చాటింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook