Whatsapp Voice Message: వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ వింటూనే చాటింగ్!

Whatsapp Voice Message: సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తన వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకురానుంది. వాయిస్ నోట్ ఫీచర్ ద్వారా మరో కొత్త అప్డేట్ ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాయిస్‌ మెసేజ్‌ వినవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2022, 09:44 PM IST
  • వాట్సాప్‌లో వాయిస్‌నోట్‌ ఫీచర్‌లో మరో కొత్త అప్‌డేట్‌
  • వాయిస్‌ మెసేజ్‌ ప్లే చేసి, ఇతరులతో చాట్ చేస్తూ ఆడియో వినవచ్చు
  • ఈ ఫీచర్ కొద్ది మంది యూజర్స్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం
Whatsapp Voice Message: వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. వాయిస్ మెసేజ్ వింటూనే చాటింగ్!

Whatsapp Voice Message: ప్రపంచంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్. మిగిలిన మెసేజింగ్‌ యాప్‌లలోనూ అవే ఫీచర్స్‌ ఉన్నప్పటికీ యూజర్‌ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్‌ కావడం వల్ల ఎక్కువ మంది వాట్సాప్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. తాజాగా వాట్సాప్‌లోని వాయిస్‌నోట్‌ ఫీచర్‌లో మరో కొత్త అప్‌డేట్‌ను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

ఈ ఫీచర్ తో యూజర్స్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే వాయిస్‌ మెసేజ్‌ వినవచ్చని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ప్రస్తుతం వాయిస్‌ మెసేజ్ ప్లే చేసి చాట్‌ పేజీ నుంచి బయటకు వస్తే ఆడియో ఆగిపోతుంది. త్వరలో అందుబాటులోకి రానున్న అప్‌డేట్‌తో వాయిస్‌ మెసేజ్‌ ప్లే చేసి, ఎంచక్కా ఇతరులతో చాట్ చేస్తూ ఆడియోను వినవచ్చు. 

మనం ప్లే చేసిన వాయిస్‌ మెసేజ్‌ చాట్ పేజీ పై భాగంలో కనిపిస్తుందని వాట్సాప్​ బీటా ఇన్ఫో వెల్లడించింది. గతంలో వాయిస్‌ మెసేజ్‌లు రికార్డ్‌ చేసిన వెంటనే సెండ్ అయ్యేవి కావు. కొద్దిరోజుల క్రితం ప్రివ్యూ వాయిస్‌ నోట్స్‌ పేరుతో కొత్త అప్‌డేట్‌ను తీసుకురానున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. 

దీంతో యూజర్స్ రికార్డ్ చేసిన మెసేజ్‌ను ఇతరులకు పంపే ముందే విని అందులో ఏవైనా తప్పులుంటే డిలీట్ చేసి, మరో కొత్త మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపొచ్చు. అలానే వాయిస్‌ మెసేజ్‌ వినేప్పుడు వేగాన్ని నియంత్రించేందుకు వీలుగా ప్లేబ్యాక్‌ స్పీడ్ ఫీచర్‌ను కూడా వాట్సాప్‌ పరిచయం చేసింది. 

అయితే ఈ ఫీచర్స్‌ కొద్ది మంది యూజర్స్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. త్వరలోనే పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్స్‌కు పరిచయం చేయనున్నారు. 

Also Read: Tecno Pop 5 LTE: జియో స్మార్ట్ ఫోన్ కు పోటీగా భారత మార్కెట్లోకి Tecno మొబైల్స్ కొత్త వేరియంట్

Also Read:  Amazon New Sale: అమెజాన్​ గ్రేట్​ రిపబ్లిక్​డే సేల్​ డేట్ వచ్చేసింది- పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News