Stock Market today: స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్​లోనూ (గురువారం) నష్టాలతో (stocks closing bell) ముగిశాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 634 పాయింట్లు తగ్గి 59,464 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 181 పాయింట్ల నష్టంతో 17,757 వద్ద స్థిరపడింది.


అంతర్జాతీయంగా సూచీలు తేరుకుంటున్నప్పటికీ దేశీయంగాంగా వీస్తున్న ప్రతీకుల పవనాలు నష్టాలకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతుండటం కూడా నష్టాలకు కారణంగా తెలుస్తోంది.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 60,045 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  59,068 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,943 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,648 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 8 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగతా 22 కంపెనీలు డీలా పడ్డాయి.


పవర్​గ్రిడ్ 4.86 శాతం, భారతీ ఎయిర్​టెల్ 1.91 శాతం, ఏషియన్​ పెయింట్స్​ 0.59 శాతం, మారుతీ సుజుకీ 0.46 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్​ 0.39 శాతం లాభాలను గడించాయి.


బజాజ్ ఫిన్​సర్వ్​ 4.58 శాతం, టీసీఎస్​ 2.25 శాతం, ఇన్ఫోసిస్​ 2.23 శాతం, హెచ్​సీఎల్​టెక్​ 1.97 శాతం, హెచ్​యూఎల్​ 1.93 శాతం నష్టపోయాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. షాంఘై (చైనా), థైవాన్​ సూచీలు నష్టపోయాయి. 


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 7 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.49 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.


Also read: Post office scheme : నెలకు రూ. 1411 తో రూ 35 లక్షలు పొందే మార్గం ఇదిగో


Also read: Gold Price Today: బ్యాడ్ ‏న్యూస్: దేశంలో ఒక్కసారిగా పెరిగిన పసిడి ధరలు.. ఎంతంటే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook