Stock Market today: స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాలతో ముగిశాయి. నేటి సెషన్​లో (బుధవారం) సూచీలు దాదాపు భారీగా (stocks closing bell) నష్టాలను మూటగట్టుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 656 పాయింట్లు తగ్గి 60,098 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 175 పాయింట్ల నష్టంతో 17,938 వద్ద స్థిరపడింది.


అంతర్జాతీయ ప్రతికూలతలు నష్టాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ముడి చమురు ధరలు పెరగటం, కరోనా కేసుల ఆందోళనకలిగిస్తుండటం వంటివి.. మార్కెట్లపై ప్రతికూలతలు పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 60,870 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  59,949 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 18,129 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,884 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 8 కంపెనీలు మాత్రమే లాభాలను నమోదు చేశాయి. మిగతా 22 కంపెనీలు డీలా పడ్డాయి.


ఎస్​బీఐ 1.83 శాతం, టాటా స్టీల్ 1.19 శాతం, మారుతీ 1.17 శాతం, యాక్సిస్ బ్యాంక్​ 0.55 శాతం, టెక్ మహీంద్రా 0.51 శాతం లాభాలను గడించాయి.


ఇన్ఫోసిస్​ 2.77 శాతం, ఏషియన్ పెయింట్స్​ 2.71 శాతం, హెచ్​యూఎల్​ 2.41 శాతం, నెస్లే ఇండియా 2.41 శాతం, బజాజ్ ఫినాన్స్​ 2.28 శాతం నష్టపోయాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. హాంగ్​ సెంగ్​ (హాంకాంగ్​) సూచీ మాత్రమే స్వల్ప లాభాలను గడించింది.


షాంఘై (చైనా), టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు నష్టపోయాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 14 పైసలు (Rupee Value today) బలపపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.42 వద్ద (Rupee Value today) కొనసాగుతోంది.


Also read: xiaomi mix 5, vivo nex 5: 2022లో బెస్ట్ కెమెరా ఫోన్స్


Also read: Google Pay Tips: ఈ టిప్స్ పాటిస్తే గూగుల్​ పేలో భారీగా క్యాష్​ బ్యాక్​లు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook