Google Pay Tips: ఆన్లైన్ పేమెంట్ యాప్‌లలో గూగుల్ పే గురించి తెలియని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న దాదాపు అందరూ ఈ యాప్ (Online Payment Apps) వినియోగిస్తుంటారు.
కేవలం మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఒక వ్యక్తి మరో వ్యక్తికి డబ్బులు పంపించుకునే సదుపాయం ఉండటమే ఇందుకు (Online Money Transfer) కారణం. అయితే ప్రస్తుతం ఇదే సేవలను చాలా యాప్‌లు అందిస్తున్నా.. గూగుల్‌పేకు మాత్రం ప్రత్యేక స్థానం ఉంది.
గూగుల్‌పే మొదట తేజ్ పేరుతో (Tez app) సేవలందించిన విషయం తెలిసిందే.
ఈ యాప్ మనీ ట్రాన్స్ఫర్ సేవలే కాకుండా స్క్రాచ్ కార్డ్‌ల రూపంలో (G pay scratch card) క్యాష్ బ్యాక్ ఆఫర్లను ఇస్తూ యూజర్లను ఆకర్షిస్తుంటుంది.
యాప్ తొలినాళ్లలో క్యాష్ బ్యాక్‌లు మాత్రమే వచ్చేవి. ఆ తర్వాత క్యాష్ బ్యాక్‌లతో పాటు గిఫ్ట్ ఓచర్ల వంటివి కూడా ఇస్తోంది గూగుల్‌పే. అయితే ఇటీవలి కాలంలో క్యాష్ బ్యాక్‌లు భారీగా తగ్గాయి. స్క్రాచ్ కార్డ్‌లలో ఎక్కవ శాతం 'Better Luck Next Time' అనేవే కనిపిస్తున్నాయి.
ఇలా ఎందుకు జరుగుతుంది? గూగుల్ పేలో క్యాష్ బ్యాక్‌లు ఎక్కువగా రావాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలని అనే విషయంపై కొంత మంది విశ్లేషకులు చెబుతున్న సలహాలను ఇప్పుడు (Tips for Google pay Cash Back) పరిశీలిద్దాం.
గూగుల్‌పే క్యాష్ బ్యాక్ టిప్స్..
గూగుల్‌పేలో మంచి క్యాష్ బ్యాక్ రావాలంటే.. ముందుగా మీరు ఒకే అకౌంట్ (ఒకే యూజర్‌తో) నంబర్‌తో ఎక్కువ సార్లు లావాదేవీలు జరపొద్దు. అలా చేస్తే మీకు క్యాష్ బ్యాక్ వచ్చే అకాశాలు తగ్గిపోతుంటాయి. అందుకే కొత్త అకౌట్లతో లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్ బ్యాక్ పొందే అవకాశాలు ఎక్కువగా (Cash Back offers in G Pay) ఉంటాయి.
ఒకే సారి భారీ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ చేయడం కూడా క్యాష్ బ్యాక్ ఆఫర్లు తగ్గేందుకు కారణం కావచ్చు. అలా జరగకుండా.. తక్కువ మొత్తంలో ట్రాన్సక్షన్స్ చేయడం వల్ల క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఎక్కువగా (Don'ts in Google Pay) పొందొచ్చు.
ఎక్కువగా వినియోగంలో లేని ఖాతాతో లావాదేవీలు జరపడం కూడా క్యాష్ బ్యాక్‌లు తగ్గేందుకు కారణం కావచ్చు. అలా కూకుండా.. రెగ్యులర్‌గా వినియోగంలో ఉన్న అకౌంట్‌కు, గూగుల్ పేను అధికంగా వినియోగించే అకౌంట్లలతో లావాదేవీలు జరపడం ద్వారా క్యాష్ బ్యాక్‌లు అధికంగా పొందే (How to Get Best Cash bank in G Pay) వీలుంది.
సింగిల్ డిజిట్ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల క్యాష్‌బ్యాక్ పొందలేరు. అందుకే కనీసం రూ.150 నుంచి రూ.500 మధ్య ట్రాన్సాక్షన్ చేయడం ద్వారా క్యాష్ (Minimum Amount for Cash back in Google Pay) బ్యాక్ పొందొచ్చు.
Also read: Gold Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు... ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Also read: Amazon sale: రూ. 14 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీ, రూ. 20 వేలకే 42 ఇంచుల స్మార్ట్ టీవీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook