Stock Market today: స్టాక్ మార్కెట్లు 2021కి (Stocks Closing bell) లాభాలతో గుడ్​బై చెప్పాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ- సెన్సెక్స్​ (BSE Sensex) 459 పాయింట్లు పెరిగి 58,254 వద్దకు చేరింది. నేషనల్​ స్టాక్ ఎక్స్ఛేంజీ-నిఫ్టీ (NSE Nify) 154 పాయింట్ల లాభంతో 17,357 వద్ద స్థిరపడింది.


దాదాపు అన్ని రంగాలు లాభాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్, ఆటో, ఎఫ్​ఎంసీజీ రంగాలు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.


2021లో సూచీల రికార్డులు ఇలా..


ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది జనవరి 1న సెన్సెక్స్ 47,869 ఉండగా.. ఈ ఏడాదే 50 వేల మార్క్​, 60 వేల మార్క్​ను తాకింది. ఈ ఏడాదికి 62,245 పాయింట్లు సెన్సెక్స్​ జీవనకాల గరిష్ఠ స్థాయి.


ఇక నిఫ్టీ 14,019 వద్ద ఈ ఏడాదిని ప్రారంభించింది. 2021లో నిఫ్టీ జీవనకాల గరిష్ఠ స్థాయి 18,604 పాయింట్లు. రెండు సూచీలు అక్టోబర్ 19న రికార్డు స్థాయిలను తాకాయి.


ఈ రోజు సెషన్​ ఎలా సాగిందంటే..


ఇంట్రాడేలో (Intraday) సెన్సెక్స్​ 58,409 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. అమ్మకాల కారణంగా ఒకానొక దశలో  57,846 కనిష్ఠానికి పడిపోయింది.


నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 17,400 పాయింట్ల అత్యధిక స్థాయిని తాకింది. 17,238 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది.


లాభ నష్టాల్లో టాప్​-5 షేర్లు..


బీఎస్​ఈ 30 షేర్ల ఇండెక్స్​లో 26 కంపెనీలు లాభాలను నమోదు చేశాయి. మిగతా 4 కంపెనీలు డీలా పడ్డాయి.


టైటాన్​ 3.50 శాతం, అల్ట్రాటెక్​ సిమెంట్​ 2.68 శాతం, కోటక్​ మహీంద్రా 2.45 శాతం, ఎస్​బీఐ 1.91 శాతం, మారుతీ 1.86 శాతం లాభాలను గడించాయి.


ఎన్​టీపీసీ 1.97 శాతం, టెక్ మహీంద్రా 0.53 శాతం, పవర్​గ్రిడ్​ 0.41 శాతం, డాక్టర్​ రెడ్డీస్​ 0.04 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి.


ఆసియాలో ఇతర మార్కెట్లు..


ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లను పరిశీలిస్తే.. షాంఘై (చైనా), హాంగ్​ సెంగ్ (హాంకాంగ్​)​ సూచీలు లాభాలను గడించాయి.


టోక్యో (జపాన్​), సియోల్​ (దక్షిణ కొరియా), థైవాన్​ సూచీలు సెలవులో ఉన్నాయి.


రూపాయి విలువ..


డాలర్​తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.74.33 వద్ద కొనసాగుతోంది.


Also read: Bank holidays 2022: వచ్చే ఏడాది బ్యాంక్​ సెలవుల జాబితా ఇదే..


Also read: New Rules from 2022: ఏటీఎం ఛార్జీల నుంచి లాకర్ల భద్రత వరకు రేపటి నుంచి మార్పులు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook