Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు- సెన్సెక్స్ 1040 ప్లస్
Stocks today: స్టాక్ మార్కెట్లలో బుల్ జోరు కొనసాగింది. బుధవారం సెషన్లో ఆర్థిక, ఐటీ షేర్ల దన్నుతో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 1,040 పాయింట్లు పెరిగింది.
Stocks today: స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయి లాభాలను నమోదు చేశాయి. మంగళవారం నమోదైన నష్టాల నుంచి తేరుకున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి కొనసాగుతున్నా మార్కెట్లు భారీ లాభాలను గడించడం విశేషం. బీఎస్ఈ-సెన్సెక్స్ 1,040 పాయింట్ల లాభంతో 56,816 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 310 పాయింట్లు పెరిగి 16,973 వద్దకు చేరింది.
లాభాలకు కారణాలు..
దాదాపు అన్ని రంగాలు నేడు సానుకూలంగా స్పందించాయి. బ్యాంకింగ్, ఐటీ షేర్ల దన్ను ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. ఈ సానుకూలతలన్నీ మార్కెట్ల లాభాలకు కారణమైనట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
సూచీల కదలికలు ఇలా..
ఇంట్రాడేలో సెన్సెక్స్ 56,860 పాయింట్ల అత్యధిక స్థాయిని నమోదు చేసింది. 56,389 కనిష్ఠానికీ పడిపోయింది.
నిఫ్టీ అత్యధికంగా 16,987 పాయింట్ల స్థాయిని తాకింది. అత్యల్పంగా 16,837 స్థాయిని కూడా చేరింది.
నేటి సెషన్లో టాప్-5 షేర్లు..
అల్ట్రాటెక్ సిమెంట్ 4.81 శాతం, యాక్సిస్ బ్యాంక్ 3.48 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3.35 శాతం, హెచ్డీఎఫ్సీ 2.92 శాతం, బజాజ్ ఫిన్సర్వ్ 2.68 శాతం లాభాలను నమోదు చేశాయి.
30 షేర్ల ఇండెక్స్‌లో సన్ ఫార్మా మాత్రమే స్వల్ప నష్టంతో ముగిసింది.
Also read:Vivo Holi Offer: హోలీ సందర్భంగా స్మార్ట్ ఫోన్స్ పై స్పెషల్ ఆఫర్స్ ప్రకటించిన వివో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook