Investment Plan: జస్ట్ రూ. 250లతో ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే చాలు..మీ కూతురు కాలేజీ ఫీజు కట్టేయొచ్చు
SSY Scheme: ఆడపిల్లల తల్లిదండ్రులకు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. కూతురు ఉన్నత చదువుల నుంచి పెళ్లి వరకు భవిష్యత్తు గురించి ముందుగానే ప్లాన్ చేసుకుంటే నిశ్చితంగా ఉండవచ్చు. అయితే కూతురు చిన్నప్పటి నుంచి ఆమెకోసం ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టినట్లయితే..చదువు, పెళ్లినాటికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ప్లాన్ లో మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే మీ కూతురు భవిష్యత్తు గురించి దిగులుపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పాప పుట్టిన తర్వాత ఈ ప్లాన్ చేస్తే ఆమె ఉన్నత చదువులకు ఉపయోగపడుతుంది. ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే ఆమె కాలేజీ ఫీజులు హ్యాపీగా కట్టేయ్యెుచ్చు. మరి ఆ స్కీమ్ ఏంటో తెలుసుకుందామా?
SSY Scheme Plan: నేటి కాలంలో చదువును కొనాల్సి వస్తుంది. నర్సరీ నుంచి ఇంజనీరింగ్ వరకు లక్షల్లోనే ఫీజులు. దశాబ్ద కాలంతో పోల్చితే చదువుపై తల్లిదండ్రులు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. పాఠశాలల స్థాయిలోనే లక్షలాది రూపాయలు ఫీజులు కడుతుంటే..కాలేజీ ఫీజులను ఊహించుకోలేము. మీ ఇప్పుడు 1వ తరగతి చదువుతుంటే.. ఆమె కాలేజీ సమయానికి వచ్చే సరికి భారీ మొత్తంలో ఖర్చు చేయాలి. అందుకే తల్లిదండ్రులు ఇప్పటినుంచే ప్లాన్ చేస్తే భవిష్యత్తులో మీ కూతురు ఫ్యూచర్ బంగారంలా ఉంటుంది.
అయితే భారత ప్రభుత్వం ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా ఒక స్కీమును తీసుకువచ్చింది. అదే సుకన్య సమృద్ధి యోజన. ఈ స్కీమును ప్రత్యేకంగా ఆడపిల్లల కోసమే రూపొందించింది. ఈ స్కీముకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆడపిల్లల ఉజ్వల భవిష్యత్తును మెరుగుపరచడం, వారి చదువులు, పెళ్లి సమయం వరకు తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. కుమార్తెల తండ్రులకు ఈ పథకం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. పెట్టుబడితో పాటు పన్ను మినహాయింపు ప్రయోజనం కూడా లభిస్తుంది. కేవలం రూ.250తో ఇందులో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు. ఇది సురక్షితమైన, అద్భుతమైన రిటర్న్ పథకం కూడా.
పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, సుకన్య సమృద్ధి యోజన ఖాతాను సంరక్షకుడు 10 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ఆడపిల్లల పేరుతో ఖాతాను తెరవవచ్చు.అయితే మన దేశంలో పోస్టాఫీసులో కానీ ఏదైనా బ్యాంకులో ఆడబిడ్డ పేరు మీద మాత్రమే అకౌంట్ తీసుకోవాలి. ఒక కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు ఆడపిల్లలు ఈ ఖాతాను తీసుకోవచ్చు. కవలలు/ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన సందర్భంలో, రెండు కంటే ఎక్కువ ఖాతాలను తీసుకోవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన ఖాతా కేవలం రూ. 250 ప్రారంభ డిపాజిట్‌తో ఖాతాను తీసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ. 250, గరిష్ట మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి లేదా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. ఈ ప్రభుత్వ పథకంలో, ఖాతా తెరిచిన తేదీ నుండి గరిష్టంగా 15 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మాత్రమే డబ్బును డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీసం రూ. 250 డిపాజిట్ చేయకపోతే, ఖాతా డిఫాల్ట్ ఖాతాను బ్లాక్ చేస్తారు. ప్రతి డిఫాల్ట్ సంవత్సరానికి కనీసం రూ. 250 + రూ. 50 చెల్లించడం ద్వారా ప్రారంభించిన తేదీ నుండి 15 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఈ ఖాతాను మళ్లీ రియాక్టివేట్ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద తగ్గింపు ప్రయోజనాలను కుమార్తెల తండ్రి లేదా సంరక్షకుడు కూడా పొందుతారు.
అయితే ఈ స్కీములో డిపాజిట్ చేసిన మొత్తంపై వడ్డీ రేటు ఏడాదికి 8.2శాతం చెల్లిస్తుంది. వడ్డీని వార్షిక ప్రాతిపదికన సమ్మేళనంతో వార్షికంగా లెక్కిస్తారు. ఇక ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ఈ స్కీంపై వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం, క్యాలెండర్ నెలలోని ఐదవ రోజు చివరి నుండి నెలాఖరు వరకు ఖాతాలో అత్యల్ప నిల్వపై వడ్డీ లెక్కిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకంలో వచ్చే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను రహితంగా ఉంటుంది.
బిడ్డకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పాస్ అయిన తర్వాత అకౌంట్లోనుంచి డబ్బు డ్రా చేసుకోవచ్చు. ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ లో 50శాతం వరకు డ్రా చేసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 21 ఏండ్ల తర్వాత అకౌంట్ ను క్లోజ్ చేసుకోవచ్చు. వివాహం జరిగిన తేదీ నుండి 1 నెల ముందు లేదా 3 నెలల తర్వాత ఖాతాను క్లోజ్ చేయడం కుదరదు.
Also Read: Reliance Share Price: రాకెట్ కంటే వేగంతో దూసుకుపోతున్న దిగ్గజ కంపెనీ స్టాక్ ..9 రోజుల్లో 55శాతం జంప్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.