Post Office RD: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చాలా రకాల రికరింగ్ డిపాజిట్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. పోస్టాఫీసు అందిస్తున్న ఈ రికరింగ్ డిపాజిట్ పథకంలో నెలకు 5 వేలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ అనంతరం ఏకంగా 3.5 లక్షలు పొందవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రికరింగ్ డిపాజిట్ అనేది ఓ రకంగా చెప్పాలంటే పిగ్గీ బ్యాంక్ లాంటిది. ఇందులో ప్రతి నెలా కొంతమొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుంటాం. మెచ్యూరిటీ తరువాత అసలుతో పాటు వడ్డీ కూడా చేతికి అందుతుంది. ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయలేనివారికి రికరింగ్ డిపాజిట్ అనేది బెస్ట్ స్కీమ్. ఎందుకంటే ఇందులో నెలవారీ డిపాజిట్ చేయవచ్చు. నెల నెలా కొద్ది మొత్తం డబ్బులు పొదుపు చేయడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చు. 


రికరింగ్ డిపాజిట్ పధకం అనేది దేశంలోని అన్ని బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఉంటుంది. బ్యాంకుల్లో 1 నుంచి 10 ఏళ్ల కాల వ్యవధికి ఈ పధకం ఉంటుంది. దాంతో మీకు అనుకూలమైంది ఎంచుకోవచ్చు. అయితే పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేయాలనుకుంటే 5 ఏళ్లకు చేయాల్సి వస్తుంది. ఐదేళ్లపాటు వడ్డీ లభిస్తుంది. బ్యాంకులో లభించే వడ్డీ కంటే ఎక్కువే ఉంటుంది. 


పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ అనేది 100 రూపాయలతో ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎంతైనా జమ చేయవచ్చు. పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ పధకంపై కాంపౌండ్ వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 6.7 శాతంగా ఉంది. వడ్డీ అనేది ప్రతి త్రైమాసికానికోసారి లెక్కిస్తారు. నెలకు 5000 చొప్పు పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్‌లో ఇవ్వెస్ట్ చేస్తే 5 ఏళ్లకు 3 లక్షల రూపాయలవుతుంది.  వడ్డీ 6.7 శాతం చొప్పున లెక్కిస్తే 56,830 రూపాయలు అవుతుంది. అంటే ఐదేళ్ల తరువాత మీకు మొత్తం 3 లక్షల 56 వేల 830 రూపాయలు అందుతాయి. 


5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ పధకంలో 12 వాయిదాలు వరుసగా చెల్లించిన తరువాత రుణం తీసుకునే అవకాశముంది. అంటే ఏడాదిపాటు ఏ మాత్రం బ్రేక్ లేకుండా వరుసగా డిపాజిట్ చేస్తుండాలి. అప్పటి వరకూ మీరు డిపాజిట్ చేసిన నగదులో సగం రుణం కింద తీసుకోవచ్చు. ఆ రుణాన్ని ఒకేసారి లేదా వాయిదాల కింద చెల్లించవచ్చు. దీనిపై వడ్డీ 2 శాతం ఉంటుంది. 


రికరింగ్ డిపాజిట్ కాల పరిమితి ఐదేళ్లు అయినా మూడేళ్ల తరువాత ముందస్తుగా క్లోజ్ చేసుకునే అవకాశముంటుంది. మెచ్యూరిటీ తరవాత రికరింగ్ డిపాజిట్ మరో ఐదేళ్లు పొడిగించవచ్చు. ఒకరు ఎన్ని రికరింగ్ డిపాజిట్ పధకాలనైనా తీసుకోవచ్చు. 


Also read: AP Cabinet 2024: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు, మూడు ప్రైవేట్ వర్శిటీలకు గ్రీన్ సిగ్నల్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook