భారతీయ మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్ల డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఎస్‌యూవీ కార్ల కారణంగా ఇతర కార్ల విక్రయాలు పడిపోతున్నాయి. ఎస్‌యూవీలో కూడా ఎంపీవీ సెగ్మెంట్ కార్లకే డిమాండ్ అధికంగా ఉండటం విశేషం. ఎందుకంటే వీటిలో పెద్ద కుటుంబం కూడా సులభంగా ఫిట్ అయిపోతుంది. అందుకే క్రేజ్ ఎక్కువ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రస్తుతం 7 సీటర్ కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు మేం చెప్పేది ఏకంగా 8 సీటర్ కార్ గురించి. దీని ధర కూడా కేవలం 13 లక్షల నుంచే ప్రారంభమౌతుంది. ఇందులో మహీంద్రా నుంచి టొయోటా వంటి కంపెనీలున్నాయి. 


1. Mahindra Marazzo: ఈ జాబితాలో అన్నింటికంటే చౌకగా లభిస్తున్నది మహీంద్రీ మరాజో. ఇది ఎస్‌యూవీ విభాగంలో ఎంపీవీ కారు. ఇందులో చాలా ఫీచర్లున్నాయి. ప్రత్యేకత ఏంటంటే ఈ కారు బేసిక్ వేరియంట్ ఎం2లో 8 సీట్ల సౌకర్యముంది. మహీంద్రా మరాజో ధర 13.41 లక్షల రూపాయల్నించి ప్రారంభమౌతుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్, 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది. 


2. Toyota Innova Crysta: టొయోటా ఇన్నోవా ఏళ్ల తరబడి నుంచి కస్టమర్లకు ఆకట్టుకుంటూ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇందులో ఇప్పుడు 7 సీటరే కాకుండా 8 సీటర్ ఆప్షన్ ఉందని చాలామందికి తెలియదు. ఈ కారు 8 సీటర్ ధర 18.14 లక్షల్లో లభిస్తుంది. ఇందులో 2.7 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది.


3. Lexus LX: లెక్సస్ ఎల్ ఎక్స్ కారు ఈ జాబితాలో అత్యంత ఖరీదైంది. ఈ అద్భుతమైన ఎస్‌యూవీలో 8 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఈ కారు ధర 2.63 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ ఎస్‌యూవీలో 5663 సిసి ఇంజన్ ఉంటుంది. 362 బీహెచ్‌పీ, 530 ఎన్ఎం జనరేట్ చేస్తుంది. ప్రత్యేకత ఏంటంటే..7.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.


Also read: Hyundai Creta Price: కేవలం 7.5 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook