TATA Air Lines: ఎయిర్ ఇండియా తిరిగి సొంతగూటికి చేరింది. టాటా సంస్థ..ఎయిర్ ఇండియాను చేజిక్కించుకుంది. తొలిసారిగా ఎయిర్ ఇండియా..టాటా తరపున అధికారిక ప్రకటన విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దశాబ్దాల తరబడి సేవలందించిన ఎయిర్ ఇండియా సంస్థ ఇవాళ్టి నుంచి సొంతగూడు టాటా సంస్థకు చేరింది. ఎయిర్ ఇండియా సంస్థ 1932లో తొలిసారిగా టాటా గ్రూప్ ఇండియాలో ఎయిర్ లైన్స్‌ స్థాపించింది. అప్పట్లో టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్‌డి టాటా ఆధ్వర్యంలో విజయవంతంగా నడిచింది. జాతీయీకరణలో భాగంగా 1953లో ఎయిర్ ఇండియా ప్రభుత్వ సంస్థగా మారింది. దశాబ్దాలుగా విజయవంతంగానే నడిచినా..గత కొన్నేళ్లుగా రుణాల్లో మునిగిపోయింది. దీంతో తిరిగి విక్రయించే ప్రక్రియను మొదలెట్టింది. వందశాతం వాటా విక్రయించాలని నిర్ణయించిన తరువాత టాటా సంస్థ తన పాత సంస్థను తిరిగి చేజిక్కించుకుంది. 


ఎయిర్ ఇండియా (Air India) గడువు జనవరి 27 నుంచి ముగిసింది. ఇవాళ్టి నుంచి అంటే జనవరి 28 నుంచి పూర్తి స్థాయిలో టాటా సంస్థలో చేతికొచ్చేసింది. టాటా ఆధీనంలో వచ్చిన తరువాత తొలిసారిగా అధికారిక ప్రకటన వెలువడింది. ఎయిర్ ఇండియాను ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా మారుస్తామని టాటా(TATA) ప్రకటించింది. విమాన ప్రయాణీకులకు కూడా తొలి ప్రకటన విన్పించింది. డియర్ గెస్ట్, నేను మీ కెప్టెన్ మాట్లాడుతున్నాను..సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న విమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వెల్‌కమ్ టు ది ఫ్యూచర్ ఆఫ్ ఎయిర్ ఇండియా, వి హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ అంటూ ప్రకటించింది. 


Also read: Tata AirIndia: 69 ఏళ్ల తర్వాత సొంత గూటికి ఎయిర్​ ఇండియా- టాటా గ్రూప్ ఆనందం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook