షేర్ మార్కెట్‌లో చాలా షేర్లు లిస్టెడ్ అయున్నాయి. ఇందులో పెద్ద పెద్ద కంపెనీలతో పాటు చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే గత నెలరోజులుగా టాటా కంపెనీ షేర్ అమాంతం పెరుగుతోంది. మార్కెట్ నుంచి అందిన వివరాల ప్రకారం 52 వారాల గరిష్టాన్ని కూడా ఈ షేర్ దాటేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా స్టీల్


టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ కంపెనీ షేర్ వేగంగా పెరుగుతోంది. టాటా స్టీల్ షేర్‌లో గత నెలరోజులుగా వేగంగా పెరుగుదల కన్పిస్తోంది. డిసెంబర్ 23, 2022న టాటా స్టీల్ క్లోజింగ్ ధర దాదాపు 102 రూపాయలు కాగా జనవరి 17 నాటికి 120 రూపాయలకు చేరుకుంది. అంతేకాదు..52 వారాల గరిష్ట ధరను కూడా దాటేసింది.


టాటా స్టీల్ ధర


ఎన్ఎస్ఈలో టాటా స్టీల్ 52 వారాల కనిష్ట ధర 82.70 రూపాయలుంది. అటు 52 వారాల గరిష్ట ధర 138.67 రూపాయలుంది. ఇటీవలే కంపెనీ తన హోల్డ్ రేటింగ్‌‌ను 150 రూపాయల టార్గెట్ ప్రైస్‌గా పెట్టి కొనుగోలు చేసేందుకు అప్‌గ్రేడ్ చేసింది. మార్కెట్ విలువ కంటే 25 శాతం వృద్ధి నమోదు చేయవచ్చని తెలుస్తోంది.


వాస్తవానికి గత కొద్దికాలంగా షేర్ మార్కెట్ పరిస్థితి ఆశించినంతగా లేదు. చాలా కంపెనీల షేర్లు నష్టాల్లో నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో నెలరోజుల్నించి టాటా గ్రూప్‌కు చెందిన టాటా స్టీల్ షేర్ పెరుగుతుండటం ఆశాజనకంగా కన్పిస్తోంది.


Also read: Budget 2023: ట్యాక్స్ పేయర్స్‌కు మర్చిపోలేని రోజు.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయంతో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook