Tata Motors: కార్ల ధరలు పెరుగుతున్నాయి. ప్రముఖ కంపెనీ కార్లు..మారుతి సుజుకీ, మహీంద్రీ, టొయోటా ఇప్పటికే ధరలు పెంచగా..ఇప్పుడు టాటా మోటార్స్ కూడా ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలోని వివిధ ఆటోమొబైల్ కంపెనీలు కార్ల ధరల్ని పెంచుతున్నాయి. మారుతి సుజుకీ, మహీంద్ర, టొయోటా తరువాత ఇప్పుడు టాటా మోటార్స్ సైతం కార్ల ధరల్ని పెంచుతోంది. వివిధ మోడళ్లపై కలిపి దాదాపుగా 1.1 శాతం ధర పెంచింది. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడంతో ధరల్ని స్వల్పంగా పెంచాయి. ఈ పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచి అంటే ఏప్రిల్ 23 నుంచి అమల్లోకి వస్తున్నాయి.


టాటా మోటార్స్ సంస్థ కార్ల ధరల్ని పెంచడమనేది ఇదేమీ తొలిసారి కాదు. జనవరిలో సైతం స్వల్పంగా 0.9 శాతం పెంచింది. అప్పట్లో కూడా ఆటోమైబైల్ పరిశ్రమలో ఇదే కారణం విన్పించింది. ఇన్‌పుట్ ధరలు అన్నింటా పెరుగుతున్నందు ఆ ప్రభావం కార్లపై ధరలపై తప్పకుండా పడుతోందని టాటా మోటార్స్ వెల్లడించింది. అయితే కార్ల ధరల్ని పెంచింది టాటా మోటార్స్ ఒక్కటే కాదు. గతంలో అంటే ఇదే ఏడాది మహీంద్రా, మారుతి సుజుకీ, టొయోటా, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్  వంటి కంపెనీలు కార్ల ధరల్ని పెంచాయి.


గతంలో మహీంద్రా కంపెనీ తమ కంపెనీ అన్ని కార్ల ధరల్ని 2.5 శాతం పెంచింది. ఫలితంగా ఎక్స్‌షోరూం ధర పది వేల నుంచి 63 వేల వరకూ పెరిగింది. ఏప్రిల్ 14 నుంచి ఈ ధరలు పెరిగాయి. అదే విధంగా మారుతి సుజుకీ కంపెనీ కార్లపై 1.3 శాతం పెంచింది. ఆ తరువాత టోయోటా కిర్లోస్కార్ కూడా 4 శాతం ధర పెంచింది. అటు ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా ధరలు ఇదే విధంగా పెంచుతున్నాయి.


Also read: Flipkart Poco M4 Pro: రూ.1,249 ధరకే Poco M4 Pro కొనుగోలు చేయోచ్చు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.