Tata New Electric Car: దేశీయ కార్ల తయారీ దిగ్గజం టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో దూసుకుపోతోంది. కంపెనీకు చెందిన ప్రతి మోడల్ కారు ఈవీ వెర్షన్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు హై ఎండ్ ఎస్‌యూవీ వాహనం టాటా హ్యారియర్స్ ఈవీ వేరియంట్ సిద్ధమౌతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా మోటార్స్‌కు చెందిన హ్యారియర్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వాహనం ఆటో ఎక్స్‌పో 2023లో సందడి చేసింది.. అప్పట్నించి టాటా హ్యారియర్స్ ఈవీ లాంచ్ ఎప్పుడెప్పుడా అనే ఆసక్తి ప్రారంభమైంది. లాంచింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ప్రొడక్షన్ వెర్షన్ ఫస్ట్ లుక్‌ను కంపెనీ విడుదల చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఇప్పటికే తనదైన ముద్ర వేసి దూసుకుపోతున్న టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు మరో కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో మార్కెట్ క్యాప్చరింగ్ కోసం ప్రయత్నిస్తోంది. టాటా మోటార్స్ హ్యారియర్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వేరియంట్ ఆటో ఎక్స్‌పో 2023లో కన్పించింది. ఇక అప్పట్నించి ఈ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందా అనే ఆసక్తి నెలకొంది. టాటా మోటార్స్ సోషల్ మీడియా ద్వారా టాటా హ్యారియర్ ఈవీ ప్రొడక్షన్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది. లాంచింగ్ ఎప్పుడనేది వెల్లడించింది.


టాటా మోటార్స్ హ్యారియర్స్ ఈవీ వేరియంట్ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించినప్పుడు తెలుపు రంగు దర్శనమిచ్చింది. ఇప్పుడు కంపెనీ బ్రౌంజ్, వైట్ రెండు రంగుల్లో డ్యూయల్ టోన్ థీమ్ అందిస్తోంది. ఈ ఎస్‌యూవీలో ఫుల్ విడ్త్ ఎల్ఈడీ బార్‌తో పాటు ఒక ఇంటిగ్రేట్ గ్రిల్ కొత్త స్ప్లిట్ హెడ్ ల్యాంప్ డిజైన్ అందిస్తోంది. టాటా హ్యారియర్స్ ఈవీని 2024లో లాంచ్ చేయనున్నామని కంపెనీ వెల్లడించింది. టాటా మోటార్స్ హ్యారియర్ ఈవీ డిజైన్‌లో పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. హ్యారియర్ ఈవీ ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్‌తో పాటు డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్ సెటప్‌తో అనుసంధానితమైంది. ఇది కాకుండా వెహికల్ టు లోడ్ , వెహికల్ టు వెహికల్ ఛార్జింగ్ సౌకర్యం కూడా ఉంది.


ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు


ఈ ఎస్‌యూవీకు చెందిన శక్తివంతమైన బ్యాటరీ నుంచి ఇతర ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీనినే వెహికల్ టు లోడ్ అంటారు. ఇక ఇతర ఎలక్ట్రిక్ వాహనాలతో కూడా ఛార్జింగ్ చేయవచ్చు. టాటా మోటార్స్ ఇటీవల టాటా హ్యారియర్ ఈవీ ఫీచర్లను వివరించలేదు. కానీ ఈ ఎస్‌యూవీ దాదాపు 400-500 కిలోమీటర్ల వరకూ డ్రైవింగ్ రేంజ్ ఉండవచ్చు. ఈ కారు పోటీ నేరుగా మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఈవీతో ఉంటుంది.


Also read: Mahindra Sales: అమ్మకాల్లో మహీంద్రా రికార్డు, మారుతి, టాటా మోటార్స్ కంటే ముందంజ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook