Mahindra Sales: అమ్మకాల్లో మహీంద్రా రికార్డు, మారుతి, టాటా మోటార్స్ కంటే ముందంజ

Mahindra Sales: ప్రముఖ మేడ్ ఇన్ ఇండియా కంపెనీ మహీంద్రా అమ్మకాల్లో కొత్త రికార్డు సృష్టించింది. దేశానికి చెందిన ఈ దిగ్గజ కార్ల కంపెనీ జూన్ నెలలో గణనీయమైన వృద్ది సాధించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 3, 2023, 05:43 PM IST
Mahindra Sales: అమ్మకాల్లో మహీంద్రా రికార్డు, మారుతి, టాటా మోటార్స్ కంటే ముందంజ

Mahindra Sales: దేశీయ కార్ల కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా మరో రెండు దేశీయ కార్ల కంపెనీలైన మారుతి, టాటా మోటార్స్‌తో పోటీ పడుతుంటోంది. ఈసారి కార్ల విక్రయాల్లో ఆ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసింది. గణనీయమైన అభివృద్ధి సాధించింది. జూన్ నెలలో భారీగా అమ్మకాలు నమోదు చేసింది. 

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకు దేశీయంగా మంచి పేరే ఉంది. దేశంలోని ప్రముఖ  కార్ల కంపెనీల్లో ఇదొకటి. మరో రెండు స్వదేశీ కార్ల కంపెనీలు టాటా మోటార్స్, మారుతి సుజుకి కంపెనీలతో పోటీ పడుతుంటుంది. ఇప్పుడు తాజాగా జూన్ నెల అమ్మకాల్లో మహీంద్రా అండ్ మహీంద్రా గణనీయమైన వృద్ధి సాధించింది. జూన్ నెల అమ్మకాల్లో మారుతి, టాటా, హ్యుండయ్ కంపెనీలను దాటేసింది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ జూన్ 2023 అమ్మకాలను ప్రకటించింది. జూన్ నెలలో 62,429 వాహనాలు విక్రయించింది. యుటిలిటీ వెహికల్ విభాగంలో మహీంద్రా డొమెస్టిక్ మార్కెట్‌లో 32,585 వాహనాలు, ఇతర వాహనాలు 33,986 నమోదు చేసింది. ఎయిర్‌బ్యాగ్ ఈసీయూ వంటి కొన్ని భాగాలతో సెమీకండక్టర్ సరఫరా ఈ నెల కూడా కొనసాగించింది. మహీంద్రా ఆటోమేటివ్ డివిజన్ విభాగం అందించిన వివరాల ప్రకారం ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియోకు డిమాండ్ ఎక్కువగా ఉండటమే కాకుండా జూన్ నెలలో 32,585 యూనిట్ల అమ్మకాలతో 22 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.

దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఇండియా గత నెల పాసెంజర్ వాహనాల స్వదేశీ విక్రయాలు 8 శాతం పెరిగి 1,33,027 యూనిట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో 1,22,685 యూనిట్లు అమ్మకాలు జరిపింది. అటు హ్యుండయ్ కంపెనీ స్వదేశీ విక్రయాలు మే నెలతో పోల్చితే 2 శాతం వృద్ధి రేటుతో 50,001 యూనిట్లు ఉంది. మే 2022లో 49,001 యూనిట్లు అమ్మకాలు జరిపింది.

అదే విధంగా టాటా మోటార్స్ మొత్తం స్వదేశీ అమ్మకాలు జూన్‌లో 1 శాతం వృద్ధి రేటుతో 80,383 యూనిట్లు అమ్మకాలు జరిపింది. జూన్ 2022లో 79,606 వాహనాలు విక్రయాలు జరిపింది.

Also read: Suzuki Swift: సుజుకి స్విఫ్ట్ కొత్త మోడల్ లాంచ్ ఈ ఏడాదే, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News