Tata Nexon EV: ప్రముఖ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్.. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విభాగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సింగిల్​ ఛార్జింగ్​తో 400 కిలో మీటర్లు ప్రయాణించేందుకు వీలుగా ఓ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోందని సమాచారం. అయితే కొత్త మోడల్​ను కాకుండా.. ఇప్పటికే అందుబాటులో ఉన్న నెక్సాన్​ ఈవీనే మరింత అప్​డేట్​ చేసి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా మోటార్స్​ కూడా విద్యుత్ వాహనాల విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వీటితో రానున్న ఐదేళ్లలో 10 కొత్త విద్యుత్ వాహనాలను తీసుకురానున్నట్లు కూడా వెల్లడించింది.


ఇక లాంగ్​-రేంజ్​ ఎక్సాన్​ ఈవీని ఏప్రిల్​ 20 విడుదల చేయొచ్చని అంచనాల వస్తున్నాయి. ఆ తర్వాత ఏప్రిల్ 28 టిగోర్​ లాంగ్ రేంజ్ ఈవీను కూడా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీనిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


కొత్త వెర్షన్​ గురించి..


ఎస్​యూవీ సెగ్మెంటోలో నెక్సాన్ ఈవీ 2020లో విడుదలైంది. ఇప్పుడు దీనికి అప్​డేట్​ వెర్షన్ రానుంది. కొత్త వేరియంట్​లో సరికొత్త ఇంటీరియర్​తో రానుందట. ఈ కొత్త వేరియంట్ ఎక్స్​ 2 ప్లాట్​ఫామ్​పై రావచ్చని ఆటోమొబైల్ వర్గాల సమాచారం.


ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్​ ఈవీ 30.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్​తో వస్తోంది. ఈ వేరియంట్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 312 కిలో మీటర్లు ప్రయాణించగలదు. ఇక కొత్త వేరియంట్​ 40 కిలోవాట్స్​ లిథియం అయాన్ బ్యాటరీతో అందుబాటులోకి రానుందట. ఈ వేరియంట్ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 400 కిలో మీటర్లు ప్రయాణిస్తుందని సమాచారం.


బ్యాటరీ సైజ్​ పెరగటంతో డిజైన్​లోని స్వల్ప మార్పులు రానున్నాయని తెలుస్తోంది. అంతే కాకుండా.. ఎలక్ట్రిక్ స్టెబిలిటీ కంట్రోల్​, క్రూయిజ్​ కంట్రోల్​, వెంటిలైజ్​డ్​ సీట్ ఫంక్షన్​ వంటి అధునాత ఫీచర్లను పొందిపరిచిందట టాటా మోటార్స్​. ఈ కొత్త వేరియంట్ మార్కెట్లోకి వస్తే.. ఇటీవల విడుదలైన ఎంజీ జెడ్​ఎస్​ ఈవీ, హ్యుందాయ్​ కోనా ఎలక్ట్రిక్​ సహా కియా నిరో వంటి వాహనాలు గట్టిపోటీ ఇవ్వనుందని సమాచారం.


Also read: LPG, Petrol Prices Today: వామ్మో.. ఎల్పీజీ, పెట్రోల్ ధరల్లో ప్రపంచ దేశాల్లో మనమే టాప్


Also read: BSNL Recharge: BSNLలో ఉత్తమ ప్లాన్.. తక్కువ ఖర్చుతో 110 రోజుల వ్యాలిడిటీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook