TATA Nexon EV Max: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కొత్త టీజర్ విడుదల చేసింది. టాటా నెక్సాన్ లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ వాహనం మరో రెండ్రోజుల్లో మార్కెట్‌లో రానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాటా మోటార్స్ త్వరలో నెక్సాన్ ఈవీ పేరుతో కొత్త వేరియంట్ లాంచ్ చేయనుంది. ఇండియాలో లాంగ్ రేంజ్ నెక్సాన్ ఎలక్ట్రిక్ కారును మే 11వ తేదీన విడుదల చేస్తోంది. దీనికి సంబంధించి టాటా మోటార్స్ ఓ టీజర్ విడుదల చేసింది. 


టాటా నెక్సాన్ ఈవీ టీజర్ చాలా ఆకర్షణీయంగా ఉంది. సింగిల్ రీఛార్జ్ ద్వారా 3 వందల కిలోమీటర్లు సులభంగా ప్రయాణించవచ్చనే సందేశాన్ని టాటా మోటార్స్ టీజర్ ద్వారా ఇస్తోంది. టాటా సంస్థ అధికారికంగా ఈ విషయాన్ని ట్వీట్ చేసింది కూడా. ముంబై నుంచి పూణేకు సులభంగా 3 వందల కిలోమీటర్లు వెళ్లవచ్చంటోంది. చెన్నై నుంచి పుదుచ్చేరి, ఢిల్లీ నుంచి కురుక్షేత్ర, బెంగళూరు నుంచి మైసూరు, గాందీనగర్ నుంచి వడోదరకు సింగిల్ రీఛార్జ్‌తో వెళ్లవచ్చని టీజర్ ద్వారా వివరించే ప్రయత్నం చేసింది. టాటా మోటార్స్ ప్రకారం నెక్సాన్ ఈవీ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 3 వందల కిలోమీటర్లు గరిష్టంగా ప్రయాణించవచ్చు.


టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి


ముందు టాటా మోటార్స్ అధికారిక వెబ్‌సైట్  https://ev.tatamotors.com/ క్లిక్ చేయాలి. ఇందులో ప్రోడక్ట్స్ సెక్షన్‌లో వెళ్లి..నెక్సాన్ ఈవీ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ ముందు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో Click Here to Register Interest పై క్లిక్ చేయాలి. వివరాలు నమోదు చేయాలి. చివరిలో సబ్మిట్ చేస్తే మీ పేరుపై వెహికర్ రిజిస్టర్ అయినట్టే.


Also read: Campus Activewear Shares: లిస్టింగ్ డే నాడే 42 శాతం పైకి ఎగిసిన క్యాంపస్ యాక్టివేర్ షేర్ ధరలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook