Campus Activewear Shares: షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఇది గుడ్‌న్యూస్. క్యాంపస్ యాక్టివేర్ షేర్లలో ఒక్కసారిగా పెరుగుదల కన్పించింది. లిస్టింగ్ డే నాడే 42 శాతం పైకి ఎగిసింది.
క్యాంపస్ యాక్టివేర్ లిమిటెడ్ అనేది ప్రాధమికంగా స్పోర్ట్స్, అథ్లెటిక్ ఫుట్‌వేర్ ఉత్పత్తులు తయారు చేసే కంపెనీ. డిస్ట్రిబ్యూటింగ్, సేల్స్ కూడా చేస్తుంది. దేశంలో అతిపెద్ద ఫుట్‌వేర్ బ్రాండ్ ఇది. 2021 ఆర్ధిక సంవత్సరంలో విలువ, పరిమాణం ఆధారంగా ఇదే అతి పెద్దది. ఈ కంపెనీ 2019లో 2 బిలియన్ల వ్యాపారం చేసింది. పురుషుల కోసం 1433 యాక్టివ్ స్టైల్, మహిళల కోసం 241 యాక్టివ్ స్టైల్స్, కిడ్స్ కోసం 485 యాక్టివ్ స్టైల్స్ కంపెనీ పోర్ట్ ఫోలియోలో ఉన్నాయి.
క్యాంపస్ యాక్టివేర్ కంపెనీ కొత్తగా ఐపీవో లిస్టింగ్ చేసింది. లిస్టింగ్ రోజు 42 శాతం పెరుగుదల నమోదు చేసింది. కంపెనీ షేర్ 20 శాతం కంటే ఎక్కువ లాభాన్ని ఆర్జించింది. అత్యధికంగా 417.70 రూపాయలు ఒక్కొక్క షేర్ ధర పలికింది. క్యాంపస్ యాక్టివేర్ ఐపీవో 355 రూపాయలకు లిస్టింగ్ అయింది.
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు 396.45 రూపాయల వద్ద ప్రతి షేర్ 35.77 శాతం లాభంతో ట్రేడ్ అయింది. అటు మార్కెట్ నిపుణులు కూడా లాంగ్‌టెర్మ్ ఇన్వెస్ట్ చేయవచ్చంటున్నారు. దీర్ఘకాలికంగా హోల్డ్ చేసుకోవాలంటే క్యాంపస్ ఐపీవో మంచిదని జీ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింఘ్వి కూడా సిఫారసు చేస్తున్నారు. కంపెనీకు మంచి భవిష్యత్, అభివృద్ధి ఉందని.దీర్ఘకాలిక సమయానికి ఇన్వెస్ట్ చేసేందుకు మంచిదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also read: డబ్బుల కోసం ఈడీ వేధిస్తోంది...ఆరోపించిన షావోమీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Campus Activewear Shares: లిస్టింగ్ డే నాడే 42 శాతం పైకి ఎగిసిన క్యాంపస్ షేర్ ధరలు
లిస్టింగ్ డే రోజే 42 ఎగిసిన క్యాంపస్ యాక్టివేర్ షేర్ ధరలు
355 రూాపాయలకు లిస్ట్ అయిన క్యాంపస్ యాక్టివేర్ షేర్
అత్యధికంగా 417.70 రూపాయలకు పలికిన ఒక్కొక్క షేర్ ధర