Tata Nexon Price 2023: బెస్ట్ సెల్లింగ్ కారు టాటా నెక్సాన్‌ను కేవలం 1.5 లక్షలకే ఇంటికి తీసుకుకెళ్లండి!
Buy Tata Nexon only rs 1.5 Lakhs on EMI. టాటా నెక్సాన్ టాప్ ఎండ్ ధర రూ.14.35 లక్షల వరకు ఉంటుంది. పూర్తి చెల్లింపు చేయడానికి మీ వద్ద డబ్బు లేకపోతే.. ఈఎంఐ ద్వారా కొనుగోలుచేయొచ్చు.
Buy Tata Nexon only rs 1.5 Lakhs on EMI: భారతదేశంలో మూడవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ 'టాటా మోటార్స్'. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మొదటి మరియు రెండవ స్థానాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్ సంస్థలో అత్యధికంగా అమ్ముడైన కారు 'టాటా నెక్సాన్'. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఎంపికల వంటి గొప్ప ఫీచర్లతో వస్తుంది. దీని ధర రూ. 10 లక్షల లోపు ఉండగా.. 8 ట్రిమ్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. ఐదుగురు కూర్చోగలిగే సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్‌కు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. టాటా నెక్సాన్ టాప్ ఎండ్ ధర రూ.14.35 లక్షల వరకు ఉంటుంది. పూర్తి చెల్లింపు చేయడానికి మీ వద్ద డబ్బు లేకపోతే.. ఈఎంఐ ద్వారా కొనుగోలుచేయొచ్చు.
టాటా నెక్సాన్ కారు బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ. 8.85 లక్షలు. మీరు ఈ వేరియంట్‌ను లోన్‌పై కొనుగోలు చేస్తున్నట్లయితే.. మీ ఎంపిక ప్రకారం డౌన్ పేమెంట్ చెల్లించవచ్చు. వివిధ బ్యాంకులలో వడ్డీ రేటు కూడా మారుతూ ఉంటుందన్న విషయం తెలిసిందే. లోన్ కాలవ్యవధి కూడా 1 సంవత్సరం నుండి 7 సంవత్సరాల వరకు ఎంచుకోవచ్చు. ఉదాహరణకు రూ. 1.5 లక్షల డౌన్ పేమెంట్, 9.8 శాతం వడ్డీ రేటు, 5 సంవత్సరాల రుణ కాలవ్యవధి ఎంచుకుంటే.. మీరు ప్రతి నెలా రూ. 15,341 ఈఎంఐ చెల్లించాలి. లోన్ మొత్తానికి (రూ. 7.25 లక్షలు) అదనంగా రూ. 1.95 లక్షలు చెల్లిస్తారు.
టాటా నెక్సాన్ కారులో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్‌లతో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇది కలిగి ఉంటుంది. దీనితో పాటు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. టాప్-స్పెక్ ట్రిమ్‌లు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటో-డిమ్మింగ్ IRVM, ఎనిమిది-స్పీకర్ సౌండ్ సిస్టమ్ మరియు ఎయిర్ ప్యూరిఫైయర్‌లను కూడా ఇందులో ఉంటాయి.
Also Read: Virat Kohli IPL Ban: విరాట్ కోహ్లీ మెడ మీద వేలాడుతున్న కత్తి.. ఐపీఎల్ బ్యాన్ తప్పదా?
Also Read: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి భారత జట్టు.. వైరల్ అవుతున్న మాజీ కోచ్ రవిశాస్త్రి ట్వీట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.