Team India Ex Coach Ravi Shastri react on India Squad For WTC Final 2023: లండన్‌లోని ఓవల్ వేదికగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023 జూన్ 7 నుంచి ఆరంభం కానుంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. వరుసగా రెండోసారి భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవలే సొంతగడ్డపై భారత జట్టు 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 కోసం ఆస్ట్రేలియా, భారత్ తమ జట్లను ప్రకటించాయి. ఒక రోజు క్రితమే బీసీసీఐ భారత జట్టుని ప్రకటించింది.
ప్రస్తుతం భారత గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ 2023లో పరుగుల వరద పారిస్తున్న సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడడమే రహానేకు కలిసొచ్చింది. జింక్స్ రాకతో సూర్యకుమార్ యాదవ్‌కు చుక్కెదురైంది. కుల్దీప్ యాదవ్, ఇషాన్ కిషన్‌కు కూడా అవకాశం దక్కలేదు. గాయం కారణంగా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు దక్కలేదు. అయితే ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌కు బీసీసీఐ అవకాశం వచ్చింది. బీసీసీఐ ప్రకటించిన భారత జట్టుపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ 2023కి భారత జట్టుని ఎంపిక చేసిన బీసీసీఐ సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్‌పై మాజీ ప్లేయర్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అత్యుత్తమ జట్టును ప్రకటించారు అని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. 'అత్యుత్తమ భారత జట్టును ప్రకటించారు. బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ మంచి పని చేశారు. వారికి నా అభినందనలు' అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.