Tata Nexon Price 2024: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటాకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అతి తక్కువ ధరలోని సేఫ్టీ ఫీచర్స్ ఎక్కువగా ఉండే కార్లను విక్రయించడంలో టాటా ఎప్పుడూ ముందుంటుంది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం కొత్త కొత్త వేరియంట్లలో కొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేస్తూ వస్తోంది. అయితే ప్రతి సంవత్సరం లాగే టాటా ఈ ఏడాది కూడా కొత్త మోడల్ కార్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. టాటా మోటార్స్ నెక్సాన్ సిరీస్‌లో మొత్తం ఐదు కొత్త వేరియంట్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ కార్లు పెట్రోల్‌తో పాటు డీజిల్ వేరియంట్లలో కూడా లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఐదు వేరియంట్లు అతిశక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్ను కలిగి ఉండబోతున్నాయి. ముఖ్యంగా మార్కెట్లో విక్రయాల్లో దుమ్ము రేపిన నెక్సాన్ డార్క్ ఎడిషన్ కూడా లాంచ్ కాబోతోంది. దీని ధరలు రూ. 11.45 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఐదు వేరియంట్లకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ టాటా నెక్సాన్‌కు సంబంధించిన ఐదు వేరియంట్ల ధరలు రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఆరంభం కాబోతున్నాయి. ఇక ఐదు వేరియంట్స్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, నెక్సాన్ పెట్రోల్ స్మార్ట్+ SUV కారు రూ. 10 లక్షల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం. ఇక నెక్సాన్ పెట్రోల్ ప్యూర్ వేరియంట్ రూ. 10.50 లక్షలు కాగా, నెక్సన్ పెట్రోల్ ప్యూర్ ఎస్ వేరియంట్    రూ. 11 లక్షలతో విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది.


ఇక మిగిలిన రెండు వేరియంట్ల విషయానికొస్తే, నెక్సాన్ డీజిల్ ప్యూర్ కారు రూ.11.80 లక్షలతో నెక్సన్ డీజిల్ ప్యూర్ ఎస్ కారు రూ. 12.30 లక్షలతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. టాటా కంపెనీ నెక్సాన్ పెట్రోల్ స్మార్ట్+, ప్యూర్, ప్యూర్ ఎస్ వేరియంట్స్ ను పెట్రోల్ మోడల్ లో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ సెటప్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. డీజిల్ వేరియంట్ లో మాత్రం ప్యూర్, ప్యూర్ S మోడల్స్ తో లాంచ్ చేయబోతున్న తెలుస్తోంది.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..


టాటా నెక్సాన్‌ 2024 టాప్‌ 10 ఫీచర్స్:
సన్‌రూఫ్‌: టాటా నెక్సాన్‌ 2024 లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ అందుబాటులో ఉంది.
డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌: 7-అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ డ్రైవర్‌కు అవసరమైన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.
కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ: టాటా నెక్సాన్‌ 2024లో iRA కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది. ఇది 40కి పైగా కనెక్టెడ్‌ ఫీచర్లను అందిస్తుంది.
టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌: 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ప్లే‌కు అనుకూలంగా ఉంటుంది.
వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌: టాటా నెక్సాన్‌ 2024 లో వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌: ఆటోమేటిక్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
క్రూజ్‌ కంట్రోల్‌: క్రూజ్‌ కంట్రోల్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
పవర్‌ అడ్జస్ట్‌బుల్‌ డ్రైవర్‌ సీట్‌: 8-వేల పవర్‌ అడ్జస్ట్‌బుల్‌ డ్రైవర్‌ సీట్‌ అందుబాటులో ఉంది.
పుష్‌-బటన్‌ స్టార్ట్‌/స్టాప్‌: టాటా నెక్సాన్‌ 2024 లో పుష్‌-బటన్‌ స్టార్ట్‌/స్టాప్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
6 ఎయిర్‌బ్యాగులు: 6 ఎయిర్‌బ్యాగులు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి.


Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి