Tata Nexon vs Maruti Fronx : మారుతి సుజుకి మొదటిసారిగా కాంపాక్ట్ క్రాసోవర్‌ ఎస్‌యూవి కారుతో కస్టమర్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మారుతి సుజుకి ప్రవేశపెడుతున్న ఆ ఎస్‌యూవి కారు మరేదో కాదు.. ఇటీవలె నొయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో మారుతీ లాంచ్ చేసిన మారుతి ఫ్రాంక్స్ ఎస్‌యువి కారు. ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన మారుతి ఫ్రాంక్స్ ఎస్‌యూవి కారు మార్చి నెలలో అమ్మకానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అలాగే మారుతి ఫ్రాంక్స్ కారు ధరల వివరాలను వచ్చే నెలలో వెల్లడించే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆటో ఇండస్ట్రీ వర్గాల అంచనాల ప్రకారం.. మారుతి ఫ్రాంక్స్ కారు ఎంట్రీ లెవల్ వేరియంట్‌కి దాదాపు రూ. 8 లక్షలుగా ఉంటుందని తెలుస్తోంది. అదే సమయంలో టాప్ వేరియంట్‌ ధర సుమారు రూ. 11 లక్షలుగా ఉండే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు. మారుతి ఫ్రాంక్స్ కొనుగోలు చేయాలనుకునే వారు తెలుసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే.. ఈ కారు కేవలం నెక్సా డీలర్స్ వద్ద మాత్రమే లభించనున్నాయి.  బాలెనో మరియు బ్రెజ్జా మధ్య అంతరాన్ని తగ్గిస్తుంది.


మారుతి ఫ్రాంక్స్ కారు ఎస్‌యూవి సెగ్మెంట్‌లో ఫీచర్స్, ధరల పరంగా టాటా పంచ్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్ వంటి కార్లతో పోటీపడనుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ధరల పరంగా టాటా పంచ్ కారు బిగినింగ్ వేరియంట్ ధర రూ.6 లక్షలు నుంచి టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.9.54 లక్షలు వరకు ఉంది. రెనాల్ట్ కైగర్ కారు విషయానికొస్తే.. రూ.6 లక్షలు నుంచి రూ.10.77 లక్షలు వరకు పలుకుతోంది. అలాగే నిస్సాన్ మాగ్నైట్ ఎంట్రీ లెవల్ వేరియంట్ ధర రూ.5.97 లక్షలు కాగా టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.10.79 లక్షలు వరకు ఉంది. 


టాటా నెక్సాన్ ఎంట్రీ లెవెల్ వేరియంట్ ధర రూ. 7.70 లక్షలుగా ఉండగా.. కియా సోనెట్ ఎంట్రీ లెవెల్ కాస్ట్ రూ. 7.69 లక్షలుగా ఉంది. అలాగే హ్యుందాయ్ వెన్యూ కారు ప్రారంభ ధర రూ. 7.62 లక్షలు కాగా మహీంద్రా XUV300 ఎంట్రీ లెవెల్ ధర రూ. 8.41 లక్షలుగా ఉంది. ఎట్రాక్టివ్ ఫీచర్స్‌కి తోడు ధరల పరంగానూ మారుతి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్, టాటా నెక్సాన్, హ్యూందాయ్ వెన్యూ వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని మారుతి భావిస్తోంది. అదే కానీ జరిగితే.. ప్రస్తుతం ఎస్‌యువి కార్ల విక్రయాల్లో టాప్ స్పీడులో దూసుకుపోతున్న టాటా నెక్సాన్ కారుకు బ్రేకులు పడక తప్పదని తెలుస్తోంది.  


మారుతి ఫ్రాంక్స్ ఎస్‌యువి మోడల్ లైనప్ సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా, ఆల్ఫా అనే ఐదు వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తోంది. ఆల్ఫా ట్రిమ్‌ మోడల్లో 360 డిగ్రీ కెమెరా, హెడ్ అప్ డిస్‌ప్లే, లెదర్‌తో కవర్ చేసిన స్టీరింగ్ వీల్, అవసరాన్నిబట్టి వేగాన్ని నియంత్రించే క్రూయిజ్ కంట్రోల్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ డీఫాగర్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్‌మెంట్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, ఫాబ్రిక్ సీట్, డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ వంటి ఎట్రాక్టివ్ ఫీచర్స్ కస్టమర్స్‌ని ఆకట్టుకుంటాయని మారుతి సుజుకి ఆశాభావం వ్యక్తంచేస్తోంది. మారుతి ఫ్రాంక్స్ కారులో 1.0 లీటర్, 3-సిలిండర్ టర్బో పెట్రోల్ బూస్టర్‌జెట్, 1.2 లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో రూపొందించారు.


ఇది కూడా చదవండి : Honda Activa as EV: హోండా యాక్టివా స్కూటీని ఎలక్ట్రిక్ స్కూటీ చేసేశాడు.. మాడిఫికేషన్ ఖర్చు, మైలేజ్ రేంజ్ ఎంతో తెలుసా ?


ఇది కూడా చదవండి : Toyota Urban Cruiser Hyryder CNG: టయోటా నుంచి సూపర్ ఎస్‌యూవి కారు.. క్రెటా, గ్రాండ్ వితారా పరిస్థితి ఏంటి ?


ఇది కూడా చదవండి : Tata Punch, Baleno: మార్కెట్లోకి కొత్త కారు ఎంట్రీ.. ఇప్పుడు టాటా పంచ్, బలెనో పరిస్థితి ఏంటి ?


ఇది కూడా చదవండి : Tata Nexon SUV Prices: మారుతి, మహింద్రాలకు చమటలు పట్టిస్తున్న ఎస్‌యూవి.. జనం కళ్లు మూసుకుని కొంటున్న ఎస్‌యూవి కారు ఏదో తెలుసా ?


ఇది కూడా చదవండి : kia EV9 Specs: కొత్త కారు కొంటున్నారా ? కొంచెం ఆగండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook